కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
0 0 0 00
కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ లతో కలసి కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తీగల వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను రేయింబవళ్లు చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్అండ్ బి ఈఈ సాంబశివరావు, తహసిల్దార్ సుధాకర్, ఆర్ అండ్ బి ఏఈ లు, కాంట్రాక్టర్, తదితరులు పాల్గొన్నారు.