ప్రచురణార్థం
మహబూబాబాద్, ఫిబ్రవరి.2
రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 11,2023 న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు పరిష్కరించడం కోసం వివిధ శాఖల అధికారులతో న్యాయ సేవా సాధికారసంస్థ ఛైర్మెన్ గారి ఆద్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి వసంత్ పాటిల్ గారు మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసుల విషయంలో సత్వర న్యాయానికి జాతీయ లోక్ అధాలత్ కృషి చేస్తున్నదని తద్వారా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న చాలా కేసులు ఇప్పటి వరకు పరిష్కృతమయ్యాయని, తొర్రూరు మండలంలోని పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి పలు పెండింగ్ కేసుల విషయమై సత్వర న్యాయ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా జిల్లాలోని పలు మండలాల్లోని పోలీస్ స్టేషన్లలోని పెండింగ్ కేసుల పరిష్కారినికై చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ సురేష్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటయ్య, అడిషనల్ పిపి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవికుమార్, పోలీస్ ఉన్నతాధికారులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.