కే.టి.ఆర్. పర్యటన ముందస్తు ఏర్పాట్లు పరిశీలన …..

కే.టి.ఆర్. పర్యటన ముందస్తు ఏర్పాట్లు పరిశీలన …..

ప్రచురణార్థం

కే.టి.ఆర్. పర్యటన ముందస్తు ఏర్పాట్లు పరిశీలన …..

మహబూబాబాద్, మే -05:

జిల్లాలో ఈ నెల 7న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు పర్యటన సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

గురువారం మంత్రి జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎంపి మాలోతు కవిత, ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అంగోతూ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లీ రవీందర్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, లైబ్రరీ చైర్మన్ గుడిపుడీ నవీన్ రావు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి కే.టి.ఆర్. పర్యటన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి జిల్లా గ్రంధాలయం, ఎన్.టి.ఆర్. స్టేడియం లో హెలిప్యాడ్, మున్నేరు వాగు వద్ద చెక్ డ్యాం లకు శంకుస్థాపన పనులు, జమండ్లపల్లి వద్ద అర్బన్ పార్క్ ను పరిశీలించారు.

అంతకుముందు మంత్రి జిల్లా గ్రంధాలయం పరిశీలించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తో మాట్లాడుతూ, ఈ నెల 7 న మంత్రి కే.టి.ఆర్. పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు, నూతనముగా నిర్మించి ప్రారంభానికి సిద్దంగా ఉన్న జిల్లా గ్రంధాలయ భవనాన్ని మొదటగా కెటీఆర్ ప్రారంభించనున్నారు అని, తరువాత మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అర్భన్ పార్కును ప్రారంభిస్తారని, మున్నేరునది పక్కన జామాండ్లపల్లి క్రాసింగ్ వద్ద 5 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న చెక్ డ్యాం పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇంతకుముందు చిన్న గ్రామ పంచాయతీ గా ఉన్న మహబూబాబాద్ మునిసిపాలిటీ గా, దిన దినాభివృద్ధి చెంది జిల్లా కేంద్రంగా కావడం, మంత్రి కే.టి.ఆర్. చేతుల మీదుగా ఇంకా మరికొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకొనుటకు చూశాం కానీ వరంగల్, హన్మకొండలో పర్యటన సందర్భంగా కొన్నిటికి పరిమితం చేసుకున్నామని, జిల్లా అభివృద్ది పథంలో నడవడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, జిల్లా అభివృద్దితో పాటు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన మేరకు వారిదృష్టికి తీసుకొని వెలదామని సూచించారు. జిల్లా కలెక్టరేట్ నూతన భవనం ఈ నెల చివరికల్లా పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంబొత్సవం చేసుకోబుతున్నామని,అదేవిధంగా జిల్లాలో మంజూరీ అయిన వైద్య కళాశాలలో నర్సింగ్ కళాశాల పూర్తి అయి ప్రారంబొత్సవానికి సిద్దంగా ఉన్నదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్పీ సదయ్య, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం, డి.ఎఫ్. ఓ. రవికిరణ్, ఎఫ్.డి. ఓ., డి.ఆర్.డి. ఏ. సన్యాసయ్య, తదితరులు పాల్గొన్నారు.

——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post