కొంగరగిద్ద గిరిజన ప్రాథమిక పాఠశాల క్రొత్త భవనాన్ని వెంటనే పూర్తిచేయాలి

ప్రచురణార్ధం

కొంగరగిద్ద గిరిజన ప్రాథమిక పాఠశాల క్రొత్త భవనాన్ని వెంటనే పూర్తిచేయాలి

గూడూరు,
మహబూబాబాద్, 2021 డిసెంబర్ – 02:

గూడూరు మండలం కొంగరగిద్ద గిరిజన ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ శశాంక గురువారం సందర్శించి పరిశీలించారు.

పాఠశాలకు మరమ్మతులు తక్షణం చేపట్టాలని ఐటీ శాఖ మంత్రికి గ్రామంలోని యువకులు ట్వీట్ చేయగా, మంత్రి కలెక్టర్ కు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించగా కలెక్టర్ పాఠశాలను సందర్శించి పరిశీలించారు.

పాఠశాల పూర్తిగా పెచ్చులూడడం గమనించిన కలెక్టర్ పిల్లలను క్రొత్త భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత అందులోకి మార్చాలని, అప్పటి వరకు తాత్కాలిక వసతి కల్పించి పాఠాలు చెప్పాలని సూచించారు.

ప్రక్కనే పాఠశాలకు నిర్మిస్తున్న నూతన భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండి పూర్తి కాకపోవడంతో వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. క్రొత్తగా నిర్మిస్తున్న భవనం కొరకు కేటాయించిన బడ్జెట్ ఐదున్నర లక్షలలో సగం నిధులతో అసంపూర్తిగా భవన నిర్మాణాన్ని చేపట్టి వదిలిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని, వెంటనే భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.

ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు బోధిస్తున్న ఈ పాఠశాలలో 44 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు అని పాఠశాల హెడ్ మాస్టర్ సూర్య నారాయణ కలెక్టర్ కు తెలిపారు. కలెక్టర్ పిల్లలను పాఠాలు చెపుతున్న తీరును, మధ్యాహ్న భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అంగన్వాడీ సెంటర్ ను పరిశిలించారు. పిల్లలకు పౌష్టిక ఆహారం, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాలు, గ్రుడ్లు ఇస్తున్నారా అని అడిగారు. బరువు, ఎత్తు తక్కువ పిల్లల విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

గ్రామస్థులతో మాట్లాడుతూ, మిషన్ భగీరథ నీటి వాడకం చేయాలని, గ్రామస్థులు అందరూ కోవిడ్ వాక్సిన్ వేయించు కోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో డి. టి.డి. ఒ.దిలీప్ కుమార్, డి. ఏ. ఒ. చత్రు నాయక్, tahsildar శైలజ, cdpo నీలోఫర్ అజ్మి, సర్పంచ్ సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post