కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించడమే సరైన నివాళి ::మేయర్ గుండు సుధారాణి

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించడమే సరైన నివాళి అని మేయర్ గుండు సుధారాణి అన్నారు.

సోమవారం కొండా లక్ష్మణ్ 160 వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

పదవులు సైతం పక్కన పెట్టి తెలంగాణ సాధనే ముఖ్యంగా పెట్టుకున్న మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.

న్యాయవాది వృత్తిలో ఉన్నప్పటి నుంచి పేద, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్నారని , నిజాం వ్యతిరేక పోరాటం, స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ తొలి,
మలిదశ ఉద్యమంలో 95 ఏళ్ల వయసులో కూడా పోరాడారనారు

వారి ఆశయాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నారని మేయర్ తెలిపారు.

ఏ ప్రభుత్వం పేదవారి గురించి ఆలోచించలేదని.. విదేశాలలో చదివేందుకు కష్టపడుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం స్కాలర్షిప్పులు ఇస్తూ ప్రోత్సహిస్తురన్నారు

ఉద్యానవన యూనివర్సిటీకి కూడా కొండా లక్ష్మణ్ పేరు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే చెందుతుందన్నారు .

ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ పేరుమీద మన ప్రభుత్వం చేనేత వర్గాలకు అవార్డులను ఇస్తుందన్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేనేత కార్మికుల కోసం ఉద్యమాలు చేపట్టి సొసైటీ లను ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బాపూజీ కృషి చేశారన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చే నేత కార్మికులకు నెలకు 15 వేల రూపాయలు వచ్చే విధంగా చేస్తుందన్నారు .

ఒకప్పుడు ఉరి సిల్ల గా ఉండే సిరిసిల్ల నేడు బతుకమ్మ చీరల ఆర్డర్ లతో బిజీ బిజీగా మారిపోయిందన్నారు.

అటు ఆడబిడ్డల గురించి ఆలోచిస్తూ..ఇటు ప్రతి చేనేత కార్మికునికి పని కల్పించే దిశగా మన ముఖ్యమంత్రి తాపత్రయ పడుతున్నారన్నారు.

దళిత బంధు మాదిరిగా చేనేత బంధు కార్యక్రమ రూపకల్పన చేసే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నందుకు చేనేత వర్గాలకు చెందిన ఆడబిడ్డగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని మేయర్ అన్నారు .

అనంతరం రాజ్య సభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సహకారం అయ్యాక బడుగు బలహీన వర్గాల కోసం విశిష్ట సేవలు అందించిన మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మంచి సంప్రదాయం అన్నారు.

ఆచార్య జయశంకర్, మహాకవి కాలోజి, ఈశ్వరీభాయ్, వెంకటస్వామి, కొండా లక్ష్మణ్, చాకలి ఐలమ్మ వంటి ఎందరో మహనీయులు ప్రజా జీవితం కోసం, పేద వారి కోసం,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం,భూస్వాములకు
వ్యతిరేకంగా ఎంతో పోరాడిన వారందరినీ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఈ వేడుకలను నిర్వహిస్తోందన్నారు.

ఒక్క తెలంగాణలోనే కాక కేంద్రంలో కూడా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను మన ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు

తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయ్యాక ఎన్నో మంచి కార్యక్రమాలను చేసుకోగలుగుతున్నామన్నారు .

ఆనాటి ఉద్యమంలో కూడా కొండా లక్ష్మణ్ అనేక అంశాలలో కీలక పాత్ర పోషించారన్నారు.

చేనేత ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవులు కూడా వదులుకున్నారన్నారు .

తన స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించలేదని బడుగు బలహీన వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ అని కొనియాడారు.

తెలంగాణ కోసం కెసిఆర్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో స్వాతంత్ర సమరయోధులను అందుబాటులో ఉండాలని లక్ష్మణ్ ఆసమయంలో కూడా అందరిని పోగు చేశారన్నారు.

అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి… దిక్సూచిగా నిలబడిన ఆ మహనీయుడి ఆశయాలను అందరం మార్గదర్శకంగా తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు అన్నారు.

అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ బి గోపి మాట్లాడుతూ ఇలాంటి వేడుకల నిర్వహణ వల్ల భవిష్యత్ తరాల వారికి మహనీయుల చరిత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని…గొప్ప వ్యక్తుల సిద్ధాంతాలు, ఆశయాలను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.హరి సింగ్, అటవీశాఖ అధికారి అర్పణ, బిసి సంక్షేమ శాఖ అధికారి నర్సింహా స్వామి, మాజీ శాసనసభ్యులు శ్రీరాములు, పలు శాఖలకు చెందిన జిల్లా స్థాయిలో అధికారులు పాల్గొన్నారు.

Share This Post