కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నMLC నారదాసు లక్ష్మణ్ రావు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

బహుజన నేత… కొండా లక్ష్మణ్ బాపూజీ

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన నారదాసు
000000

సకలజనుల, సబ్బండ వర్గాల ప్రజల కోసం జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ బహుజన నేతగా ఖ్యాతి గడించారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతి సందర్భంగా ఉజ్వల పార్క్ సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ నిస్వార్థ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మహాత్మా గాంధీజీ స్ఫూర్తి తో దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని అదే విలువలను జీవితాంతం పాటించారని కొనియాడారు. బహుజన నేతగా, దేశవ్యాప్తంగా నేతన్నలను సంఘటితం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ సాధనే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, నగర మేయర్ వై. సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు వాసాల రమేష్ తదితరులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వెతుకు సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి వేముల విష్ణు మూర్తి, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, మాజీ జెడ్పిటిసి ఇప్పన పల్లి సాంబయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post