కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం యువతరానికి స్ఫూర్తిదాయకం:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 27: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం యువతరానికి స్పూర్తి దాయకమని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ సబ్బండ వర్గాల ప్రజల కోసం జీవితాంతం పోరాడారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పోరాటయోధుడు కొమరం భీమ్ తో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా పోరాట యోధుడిగా కీర్తి గడించారని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని అదే విలువలను జీవితాంతం పాటించారని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, జిల్లా బిసి సంక్షేమ అధికారి డి. శ్రీనివాస రెడ్డి, సహాయ బిసి సంక్షేమ అధికారి బి. రవీందర్, వసతి గృహ సంక్షేమ అధికారులు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల బాలరాజు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post