కొత్తకోట నర్సరీ, రాజాపేట, ఈదులబాయి తాండ, కానాయపల్లి గ్రామ పంచాయతీలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన, తేది:30.11.2021, వనపర్తి.

వనపర్తి జిల్లాలో ధాన్యం సేకరణలో ఏలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.
మంగళవారం వనపర్తి జిల్లాలోని రాజాపేట, ఈదులబాయి తాండ, కానాయపల్లి గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ఐ.కె.పి. కేంద్రాలలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారా ? ధాన్యం కొనుగోలులో ఎక్కడైనా సమస్యలున్నాయా ? అని ఆమె అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నడుస్తున్నాయని, ధాన్యం సేకరణలోఎలాంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా నడుస్తున్నట్లు అధికారులు, జిల్లా కలెక్టర్ కు తెలిపారు.
వర్షం వచ్చే అవకాశం ఉన్నందున అన్ని కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ట్రాన్స్ పోర్ట్, ఇతర సమస్యలు రాకుండా చూసుకోవాలని ఆమె తెలిపారు. ఐ. కె.పి. ద్వారా 228 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు, 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆమె తెలిపారు. డిఆర్డీఓ, సివిల్ సప్లై, సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలలో దాన్యం తీసుకొచ్చే రైతులు తమ అకౌంట్లకు ఆధార్ అనుసంధానం చేయాలని, పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ తెరిచి, అకౌంట్ నెంబరును వ్యవసాయ అధికారులకు అందజేయాలని, దాన్యం డబ్బులు నేరుగా వారి ఖాతాలో జమ అవుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. వరి ధాన్యం కేంద్రాల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తవివ్వరాదని ఆమె సూచించారు. హమాలీలు అందుబాటులో లేనిచో రైతులు తమ, తమ సంచులను నింపుకొని అందుబాటులో ఉంచాలని, యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆమె సూచించారు.
కొత్తకోట పట్టణ ప్రకృతి నర్సరీ, పురపాలక సంఘం నర్సరీని ఆమె తనిఖీ చేశారు. హైవే పైన మొక్కలు నాటాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ వెంట జడ్పీ వైస్ చైర్మన్ వామ న్ గౌడ్, జిల్లా సివిల్ సప్లై అధికారి అనిల్, డి సి సి బి డైరెక్టర్ వంశీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వ ర్, అడిషనల్ డి ఆర్ డి ఓ కృష్ణయ్య, ప్రశాంత్, రాజాపేట మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, షేక్ మున్న,నంద కిషోర్ రెడ్డి, చంద్ర శేఖర్, సర్పంచ్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
____________
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడింది.

Share This Post