కొత్తకోట మున్సిపాలిటీలోని వివిధ అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.     తేది:11.11.2021, వనపర్తి.

ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్  ఆదేశించారు.
గురువారం కొత్తకోట మున్సిపాలిటీలోని వివిధ అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం, ఎప్పటికప్పుడు వాటికి నీరు అందించడం, ఎండిన మొక్కలు ప్రదేశంలో కొత్త మొక్కలను నాటటం, తోటల మనుగడను పునరుద్ధరించడం, ప్రభుత్వ ప్రదేశాలలో కొత్త మొక్కలను నాటటం, ప్రభుత్వ లక్ష్యం చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం మొదలైన పనులను అధికారులు శ్రద్ధ వహించి పురోగతి సాధించేలా కృషి చేయాలని ఆయన మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
భువన్ సర్వే పనుల పురోగతి ఆశించిన స్థాయిలో జరగడం లేదని, ప్రతి రోజూ వాటిని పర్యవేక్షించాలని ఆయన మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. T.S. B-pass ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి, ప్రతిరోజూ పర్యవేక్షించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు నిర్ణీత సమయాన్ని అధిగమించకుండా పరిష్కరించాలని, అభివృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు.
స్వయం సహాయక సంఘాల ద్వారా (SHGల) బ్యాంక్ లింకేజీని మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని, తద్వారా వారు ఉపాధి పొందేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, వాటిని  పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు ఆయన వివరించారు. మెప్మా కార్యకలాపాలను ఎలాంటి జాప్యం లేకుండా పర్యవేక్షించాలని, స్వయం సహాయక బృందాలు  బ్యాంకు లింకేజీ, వీధి విక్రయాల పంపిణీ వంటి కార్యక్రమాలు అభివృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలని, మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆయన సూచించారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని, ప్రణాళికాబద్ధంగా పనులలో జాప్యం లేకుండా పూర్తి చేయుటకు కృషి చేయాలని, ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశించారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంట కొత్తకోట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ రమేష్, వివిధ  వార్డ్లా కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
………………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post