కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ జాతీయ ఓటరు దినోత్సవం నాటికి ఎపిక్ కార్డులను అందజేయాలి – రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ జాతీయ ఓటరు దినోత్సవం నాటికి ఎపిక్ కార్డులను అందజేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సూచించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా ప్రస్తుతం కొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు తమ ఎపిక్ కార్డు ను పోస్టు ద్వారా గాని గ్రామ పంచాయతీ ద్వారా గాని అందజేసే విధంగా చర్యలు తీసుకోవలని కలెక్టర్లను సూచించారు. ఈ నెల 17వ తేదీన ఆయా జిల్లాలకు సంబంధించిన ఎపిక్ కార్డులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి తీసుకువెళ్లాలని తెలిపారు. అదేవిధంగా ఈ.వి.యంలు భద్రపరచిన గోదాములను సందర్శిస్తూ ఉండాలని, కొత్త ఈ.వి.యం. భవనాలకు ఈ.వి.యం లు ఇంకా మార్చని వారు వెంటనే మార్చవలసిందిగా తెలియజేసారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఆన్లైన్ ద్వారా ఓటరు జాబితాలో తమ పెరు నమోదుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం, అవగాహన కల్పించాలని తెలిపారు. స్వీప్ యాక్టివిటి నిర్వహించి ఓటు హక్కు పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని తెలియజేసారు.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఎలక్షన్ సెల్ సిబ్బంది తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Share This Post