కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసనమండలి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీ చేశారు

. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాసనమండలి ఎన్నికలు నిర్వహణకు రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, భద్రాచలంలో 84 మంది, కొత్తగూడెంలో 221 మంది మొత్తం 305 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలోనికి సెల్ఫోన్లు, కెమేరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పేపర్లు, నీళ్ల సీసాలు, హ్యాండ్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు అనుమతి లేనందున నిశిత పరిశీలన చేసి పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించాలని సెక్టోరియల్ అధికారిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు దూరం వరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిభిరాన్ని, కరోనా పరీక్షలు నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి ఓటరును ధర్మల్ స్కానర్ ద్వారా పరిశీలించాలని, ఏదేని లక్షణాలున్న ఓటర్లుకు తక్షణం వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు నిర్వహణకు అంబులెన్సును అందుబాటులో ఉంచాలని చెప్పారు. అగ్నిప్రమాదం సంబవించిన తక్షణం అదుపు చేసేందుకు అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరణతో పాటు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలన చేయనున్నట్లు చెప్పారు. ఓటర్లును గుర్తించడానికి మున్సిపల్ కమిషనర్లుకు, యంపిడిఓలకు విధులు కేటాయించినట్లు చెప్పారు. ఖమ్మం రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ మెటీరియల్ అప్పగించిన తదుపరి అన్ని సక్రమంగా ఉన్నట్లు ధృవీకరణ చేసేంతవరకు పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బంది రిసెప్షన్ కేంద్రాల్లోనే ఉండాలని చెప్పారు. పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య సెక్టోరియల్ అధికారులతో పోలింగ్ మెటీరిల్ ఖమ్మం రిసెప్షన్ కేంద్రానికి తరలించు విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు భద్రాలచం ఏఎస్పీ, కొత్తగూడెం |అడ్మిన్ ఏఎస్పీలు పర్యవేక్షణ చేసినట్లు చెప్పారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తగు సూచనలు జారీ చేశారు. ఎటవుంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ స్వర్ణలత, ఏఎస్పీ ప్రసాదరావు, డిఎస్పీ వెంకటేష్ తహసిల్దారులు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post