కొత్తగూడెం పట్టణంలో క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆర్డీఓకు సూచించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంటి పట్టాలు జారీ ప్రక్రియలో జాప్యాన్ని నివారించి సత్వరమే పట్టాలు మంజూరు చేయాలని చేసిన పిర్యాదును పరిశీలించిన కలెక్టర్ వచ్చే వారంలో పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. క్రమబద్ధీకరణకు తిరస్కరించిన లబ్ధిదారులకు లిఖితపూర్వకంగా నోటీసులు జారీ చేయాలని, తిరస్కరించిన దరఖాస్తుల లబ్దిదారులు వివరాలను రిజిష్టరులో నమోదులు చేయాలని చెప్పారు. దివ్యాంగులకు రెండు పడక గదుల ఇండ్లు మంజూరులో రిజర్వేషన్ అములు చేయు విధంగా తహసిల్దారులకు ఆదేశాలు జారీ చేయాలని ఎటకు సూచించారు. భద్రాలచం ఆసుపత్రిలో ఆల్ట్రా స్కానింగ్ చేయడం లేదని చేసిన పిర్యాదును పరిశీలించిన కలెక్టర్ తక్షణమే సూపరింటెండెంట్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించు విధంగా చర్యలు తీసుకున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువత ప్రజావాణిలో దరఖాస్తులు చేస్తున్నారని, ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టినపుడు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని | ప్రజావాణిలో దరఖాస్తులు చేయొద్దని చెప్పారు. రుణాలు మంజూరులో బ్యాంక్లు జాప్యం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ జాప్యం లేకుండా సకాలంలో రుణాలు మంజూరు చేయాలని ఎల్దియంను ఆదేశించారు. ఇటువంటి సమస్యలు తన దృష్టికి వస్తే ప్రభుత్వ పరంగా ఎస్బీఐలో ఉన్న ఖాతాలను రద్దు చేసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్వభావంపై శాఖల వారిగా నివేదికలు సిద్ధం చేయాలని ఏఓ గన్యాను ఆదేశించారు. ప్రజావాణి సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయొద్దని, ఫిర్యాదు దారునికి లిఖితపూర్వకంగా సమాదానం ఇవ్వాలని, పరిష్కరించకుండా కార్యాలయాల చుట్టూ ప్రజలను త్రిప్పుకోవద్దని ఆయన స్పష్టం చేశారు.. ప్రజావాణిలో సమస్యను పరిష్కరించాలని ప్రజలు అందచేసిన వినతులు కొన్ని: వేమవరపు బద్రయ్య, దమ్మపేట మండలం, మందలపల్లి గ్రామం:- అకినేపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెం. 292/ఏలో. ఉన్న 4.05 ఎకరాల భూమిని యర్రపాటి పకీరు ఆక్రమించుకున్నారని, హై కోర్టును ఆశ్రయించగా డిస్మిస్ చేసిందని, కోర్టు ఉత్తర్వులననుసరించి పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాల్సిందిగా చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం దమ్మపేట తహసిల్దార్కు ఎండార్స్ చేశారు. ముల్కలపల్లి మండలం, పూసుగూడెం గ్రామానికి చెందిన తేజావత్ బాబు కమ్యూనిటీ డవలప్మెంట్, బిఈడి చదివియున్నానని, 57 శాతం వైకల్యం కలిగి ఉన్నానని, తనకు డిసిపియు యూనిట్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం జిల్లా సంక్షేమ అధికారికి ఎండార్స్ చేశారు. ఆదూరి వెంకటేశ్వర్లు మరికొందరు వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ సమయంలో ల్యాబ్ టెక్నీషియన్ పనిచేశామని, 5-11-2021తో సేవాకాలం పూర్తి కావడంతో విధుల నుండి తొలగించారని, కావున తమ యొక్క సేవలను కొనసాగించు విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం జిల్లా వైద్యాధికారికి ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలానికి చెందిన జె.బాబు, తాను దివ్యాంగుడనని, జీవనోపాధి కొరకు పాల్వంచ రైతు బజార్లో కూరగాయల విక్రయాలు నిర్వహించుటకు నిర్మిస్తున్న దుకాణాల్లో ఒక దుకాణం కేటాయించాలని, చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం పాల్వంచ మున్సిపల్ కమిషనరు ఎండార్స్ చేశారు. సుజాతనగర్ మండలం, నిమ్మలగూడెం గ్రామ పంచాయతీకి చెందిన బదిగడ పకీరు తాను చూపు లేని దివ్యాంగుడనని, ఏ పనులు చేసుకోలేకపోతున్న తనకు వికలాంగుల పింఛను మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డిఆర్డిఓకు ఎండార్స్ చేశారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post