పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
0 0 0 0
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ సోమవారం తనిఖీ చేశారు.
కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రేకుర్తి లోని ప్యారడైస్ పాఠశాల లోని పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఆ సౌకర్యాలు కలగకుండా చూడాలని, వేసవి దృష్టా త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. ఎండల తీవ్రత వల్ల విద్యార్థులు ఎవరు కూడ ఇబ్బందులకు గురికాకుండా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంట ఆర్డిఓ ఆనంద్ కుమార్, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.