కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న రాష్ట్ర బి.సి.సంక్షేమ &; పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

దేశానికి అన్నం పెట్టే రైతన్న కు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

మానవతకు మారుపేరు కెసిఆర్

 

రాష్ట్రంలో 6920 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు- అవసరమైతే ఇంకా ఏర్పాటు

 

లక్ష  80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి1.74 మెట్రిక్ టన్నుల ధాన్యం  రైస్ మిల్లులకు తరలించాం

 

రైతులు ఇబ్బందులు పడకుండా పంటలను సజావుగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని వెళ్తున్నారు

 

రైతులు నాణ్యత ప్రమాణాల మేరకు 17 శాతం లోపు ప్రేమ ఉన్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవాలి

 

రైతుల స్థైర్యం దెబ్బతినేలా ఆరోపణలు చేయొద్దు

 

కేంద్రం సహకరించకున్నా గన్నీల సేకరణ

 

కరీంనగర్ జిల్లాలో 357 కొనుగోలు కేంద్రాల అంచనా, 180 ఏర్పాటు, 1582 మెట్రిక్ టన్నుల సేకరణ

 

కిలో తరుగు తీయొద్దు – తరుగు తీసినట్లు తెలిస్తే  అధికారులదే బాధ్యత

 

 

రాష్ట్ర బీసీ సంక్షేమం,పౌరసరఫరాల శాఖ మంత్రి

గంగుల కమలాకర్

000000

 

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా అండగా నిలబడాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని,  రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

 

 

శుక్రవారం కొత్తపల్లి మండలం కమాన్ పూర్, హాజీపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు పెద్దన్నగా అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం నిలవలేదని, మానవతకు మారుపేరు అయినా కెసిఆర్ రైతులకు అండగా నిలబడ్డారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు దేశానికి అన్నం పెట్టే రైతన్న అరగోస కోసం పడేవారని సాగునీరు లేక సాగునీరు ఉంటే కరెంటు లేక రెండు ఉంటే పెట్టుబడి లేక, కాలం కత్తిరించి పంట పండించిన కొన్ని నాథుడు లేక చాలా ఇబ్బందులు పడేవారు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  రైతు కావాల్సిన పంటల సాగుకు పెట్టుబడి దానికోసం రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తూ రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు.

ఏ రైతుకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, ఏరైతు ఇబ్బందులు ఉన్నాయని పిర్యాదు చేయడం లేదని అన్నారు.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 357 కొనుగోలు కేంద్రాలు పాడు చేయనున్నట్లు ఇప్పటికే  180 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు, 2,46,000 వేల ఎకరాల్లో వరిసాగు 3,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సెకరించే అంచనా వేసాం, ఇప్పటివరకు 1682 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయని దిగుబడి బ్రహ్మండంగా వచ్చే సూచనలతో ఎకరాకు 25 నుండి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెపుతూ రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.

కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో రైతులు ఎవరూ దళారులకు, మధ్యవర్తులకు అమ్ముకోవద్దని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో గ్రేడ్ ఏ రకానికి 1960|_ కనీస మద్దతు ధర, సాధారణ రకానికి1940/- కనీస మద్దతు ధర కేటాయించి కొనుగోళ్లు చేస్తున్నామని, రైతులకు అండగా ప్రభుత్వం ఉందని పునరుధ్ఘాటించారు.

చాలా మంది అర్థం పర్థం లేని అనవసర ఆరోపణలు చేస్తున్నారని, సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. అందుబాటులో గన్నీ బ్యాగులు లేవని కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని, ఇతర సామాగ్రిని సైతం అందుబాటులో లేవని మాట్లాడుతున్నారని ఇవన్నీ అవాస్తవాలన్నారు. ఈ యాసంగిలో 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టినప్పుడే 1 కోటి 60 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని చెప్పామని, మొత్తం సివిల్ సప్లైస్ యంత్రాంగం త్వరతిగతిన స్పందించి మిల్లర్లు, రేషన్ డీలర్ల నుండి పాత గన్నీలు సేకరించామన్నారు. అంచనాకు మించి తక్కవ సమయంలోనే గన్నీలు సేకరించిన విషయాన్ని వెల్లడించారు మంత్రి గంగుల. ఈ నెలాఖరు వరకు 3 కోట్ల గన్నీలు అవసరముంటే నిన్నటివరకే 6 కోట్ల 85 లక్షల గన్నీలు సేకరించి సిద్దంగా ఉంచామన్నారు, ఇందులో కొత్తవి 57లక్షలు అందుబాటులో ఉండగా మరో 8 కోట్లు కొత్త గన్నీలు అవసరమన్నారు, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసామని, వాటిని కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వొద్దని హితవు పలికారు, అన్ని జిల్లాలకు అవసరమైన గన్నీలు పంపామని, కావాలంటే స్వయంగా చెక్ చేసుకోవాలని, అబద్దాలు ప్రచారం చేయడం తగదన్నారు మంత్రి. దుష్రచారాలు నమ్మెద్దని రైతులకు విజ్ణప్తి చేసారు, ఫెయిర్ ఆవరేజ్ క్వాలిటీతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వండని, అలా ధాన్యం తూకం ఐపోయిన తర్వాత ఇంటికి వెల్లొచ్చన్నారు, ఆ తర్వాత బాధ్యత అధికారులు చూసుకుంటారన్నారు. రైతుకు రైస్ మిల్లులకు సంబందం లేకుండా చూసామన్నారు, ఎక్కడైనా తరుగు తీసే అవకాశం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని, అలా లేని పక్షంలో కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలన్నారు. 6920 కోనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అంచనా వేసామని, అవసరమైన ప్రతీ చోట ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. ఇప్పటివరకూ కొనుగోళ్లపై ఏ రైతు వద్దనుండి కంప్లైంట్ రాలేదని అన్నారు. 2384 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని 873 కొనుగోలు కేంద్రాల్లో సేకరణ జరుగుతుందన్నారు 1 లక్షా 86 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని, 1 లక్షా 74 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు తరలించడంతో పాటు రైతులకు డబ్బులు రెండు రోజుల్లోనే అకౌంట్లలో వేస్తామన్నారు. ఈ ధాన్యంలో ఒక్క రైతు కూడా తరుగు తీసారని చెప్పలేదన్నారు. ఇది కొనుగోల్లలో ముఖ్యమంత్రి  తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు.

తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రభుత్వం, భూమి, సాగు ఉన్నా ఈ దిగుబడి ఎందుకు సాద్యం కాలేదన్నారు, దుక్కి దున్నాలంటే బాంకులోన్లు, షావుకారి రుణాలు పెరిగి, నీళ్లులేక, కరెంటు లేక పంట ఎండి భూములు అమ్ముకునే పరిస్థితి ఉండేదని, అరకొర పండిన పంటను కూడా దళారులే బొక్కేసేవారన్నారు, కానీ తెలంగాణను సాధించిన ఉద్యమకారుడే పాలకుడుగా ఉన్నాడని, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన క్రుషి రైతు అనుకూల విధానాల వల్ల సాధించిన గణనీయమైన ప్రగతి ఇది అన్నారు, కానీ చల్లగున్న రైతన్నను చూసి ఓర్వకుండా కేంద్ర బీజేపీ మోకాలడ్డుతూ కొనవల్సిన బాధ్యతల్నుండి చేతులెత్తేసిందన్నారు, ఈ పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి లేకపోతే గతంలో మాదిరి రైతు ఆత్మహత్యలకు దారి తీసేదన్నారు. మానవత్వం గల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత ఖర్చైనా భరించి రైతుకు అండగా ఉండి చివరి గింజ వరకూ కొనాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు మంత్రి గంగుల.

రైతు పంటలు మానేస్తే దేశానికి అన్నం పెట్టే వారెవరన్నారు,

 

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, ఎంపీపీ శ్రీలత, జెడ్ పి టి సి పెద్దల కరుణ, పి ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ జి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post