కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ పెండింగ్ భూ సేకరణ త్వరలోనే పూర్తి చేస్తాం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ పెండింగ్ భూ సేకరణ త్వరలోనే పూర్తి చేస్తాం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

—————————————-

కొత్తపల్లి – మనోహరాబాద్ కు సంబంధించిన రైల్వే లైన్ పెండింగ్ భూ సేకరణ ప్రక్రియ జిల్లాలో పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

గురువారం కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖకు చెందిన
పరిశ్రమల పాలసీ , ప్రోత్సాహ విభాగం ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని అన్ని జిల్లాలో పురోగతిలో ఉన్న రోడ్లు, రైల్వే లైన్ ల భూ సేకరణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
కొత్తపల్లి – మనోహరాబాద్ కు సంబంధించిన రైల్వే లైన్ భూ సేకరణకు సంబంధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వ అధికారులు అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సుమారు 946 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 804 ఎకరాల భూ సేకరణ పూర్తయిందని జిల్లా కలెక్టర్ అధికారులకు వివరించారు. ఇప్పటివరకు తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామం వరకు భూసేకరణ పూర్తయిందని తెలిపారు. దీనిని రైల్వే శాఖకు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. వేములవాడ – నాంపెల్లి లో భూ సేకరణ పురోగతిలో ఉందన్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న భూ సేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

సమీక్షలో ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ఉపేందర్ రావు, పర్యవేక్షకులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post