కొత్త ఓటరుగా నమోదైన వారికీ BLO ల ద్వారా ఎపిక్ కార్డులు అందించాలి…. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి… శశాంక్ గొయల్

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి, ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు ఎపిక్ కార్డులు బూత్ లెవల్ అధికారుల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లను కోరారు.

బుధవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ, తదితర విషయాలపై సూచనలు చేస్తూ, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఓటర్ కిట్ కూడా జాతీయ ఓటర్ దినోత్సవం వచ్చే జనవరి 25 లోగా నూతనంగా నమోదైన ఓటర్లకు అందచేయాలని తెలిపారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు కలిగి ఉంటుందని అన్నారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సం. లు నిండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్జిన దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిఖిల, ఎలక్షన్ సెక్షన్ తహసీల్దార్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post