కొత్త కలెక్టరేట్ పరిశీలించిన ప్రియాంక వర్గీస్

 

అటవీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం నాడు కొత్త కలెక్టరేట్లో సదుపాయాలను, సౌకర్యాలను, హరితహారం మొక్కల ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి పరిశీలించారు.

ఎక్కడ లేని విధంగా కొత్త కలెక్టరేట్లో ఆకర్షణీయంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటించారని ప్రశంసించారు. గార్డెన్ లో కొన్ని రకాల అందమైన పూల మొక్కలు పెట్టించాలని సూచించారు. ఫౌంటెన్ను పరిశీలించారు.
కలెక్టర్ చాంబర్ చాలా బాగుంది అన్నారు. మీటింగ్ హాల్ పరిశీలించారు.

అంతకుముందు జిల్లాకు విచ్చేసిన ఆమెకు కలెక్టర్ పుష్ప గుచ్చం అందించి స్వాగతం తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎఫ్ వో సునీల్, ఆర్ అండ్ బి. ఎస్ ఇ రాజేశ్వర్ రెడ్డి, డి పి ఓ జయసుధ, ఆర్డిఓ రవి సంబంధిత అధికారులు ఉన్నారు.

Share This Post