కొత్త చెరువు, మినీ స్టేడియం పెండింగ్ పనులు రెండు రోజుల్లో పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*కొత్త చెరువు,మినీ స్టేడియం పెండింగ్ పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

——————————
సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు చేపట్టిన క్రొత్త చెరువు అభివృద్ధి సుందరీకరణ పెండింగ్ పనులను, అలాగే మినీ స్టేడియం పెండింగ్ పనులను రెండు రోజుల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కు సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

శనివారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ, వైస్ చైర్మన్ శ్రీ మంచె శ్రీనివాస్ ల తో కలిసి కోత్త చెరువు సుందరీకరణ పనులు, మినీ స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

సిరిసిల్ల పట్టణంలో కొత్త చెరువును 11 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి తో పరిశీలించారు.

1.6 కి.మీ. మేర బండ్అభివృద్ది, సుందరీకరణ పనుల పురోగతిని
జిల్లా కలెక్టర్ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. 4 ఎకరాల్లో ఆట వస్తువులు, గ్రీనరీ, సౌకర్యాల కల్పన పనులకు పరిశీలించారు. బండ్ పై ఎక్కడైనా
మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను వెంటనే నాటాలన్నారు.
బండ్ పరిసరాలను మొత్తం చెత్త చెదారం లేకుండా చూడాలన్నారు. ట్రైన్ పనితీరును మరోసారి చెక్ చేసుకోవాలని అన్నారు.

పుర ప్రజలకు, సమీప గ్రామాల ప్రజలకు కొత్త చెరువు ప్రదేశం మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తుందని, ప్రజలు ఉల్లాసంగా గడపడానికి అనుకూలంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

సిరిసిల్ల పట్టణంలో 3 కోట్ల రూపాయలతో 4 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న మినీ స్టేడియంను క్షేత్ర స్థాయిలో సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

అనంతరం సిరిసిల్ల పట్టణంలో 3
కోట్ల రూపాయలతో 4 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న మినీ స్టేడియంను
అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
మినీ స్టేడియం ఆర్చ్ సమీపంలో సిసి రోడ్డును పూర్తి చేయాలన్నారు. వాటర్ పౌంటైన్, వాలి బాల్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డార్మేటరి , టాయిలెట్ లను క్లీన్ గా ఉంచాలన్నారు.

సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట ఇంచార్జీ DRO శ్రీ టి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య , ఇంజనీరింగు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

——————————

Share This Post