కొత్త చెరువు, మినీ స్టేడియం లను ప్రారంభోత్సవాలకు సర్వం సన్నద్ధం: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*కొత్త చెరువు,మినీ స్టేడియంలను ప్రారంభోత్సవాలకు సర్వ సన్నద్ధం చేయాలి: జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

——————————
సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు చేపట్టిన క్రొత్త చెరువు అభివృద్ధి సుందరీకరణ పెండింగ్ పనులను, అలాగే మినీ స్టేడియం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కు సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ బి సత్య ప్రసాద్ తో కలిసి కోత్త చెరువు సుందరీకరణ పనులు, మినీ స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

సిరిసిల్ల పట్టణంలో కొత్త చెరువును 11 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి పరిశీలించారు.

1.6 కి.మీ. మేర బండ్అభివృద్ది, సుందరీకరణ పనుల పురోగతిని
జిల్లా కలెక్టర్ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. 4 ఎకరాల్లో ఆట వస్తువులు, గ్రీనరీ, సౌకర్యాల కల్పన పనులకు పరిశీలించారు. బండ్ పై ఎక్కడైనా
మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను వెంటనే నాటాలన్నారు.
బండ్ పరిసరాలను మొత్తం చెత్త చెదారం లేకుండా చూడాలన్నారు. ట్రైన్ పనితీరును మరోసారి చెక్ చేసుకోవాలని అన్నారు.

పుర ప్రజలకు, సమీప గ్రామాల ప్రజలకు కొత్త చెరువు ప్రదేశం మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తుందని, ప్రజలు ఉల్లాసంగా గడపడానికి అనుకూలంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

సిరిసిల్ల పట్టణంలో 3 కోట్ల రూపాయలతో 4 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న మినీ స్టేడియంను క్షేత్ర స్థాయిలో సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

అనంతరం సిరిసిల్ల పట్టణంలో 3
కోట్ల రూపాయలతో 4 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న మినీ స్టేడియంను
అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
మినీ స్టేడియం ఆర్చ్ సమీపంలో సిసి రోడ్డును పూర్తి చేయాలన్నారు. వాటర్ పౌంటైన్, వాలి బాల్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డార్మేటరి , టాయిలెట్ లను క్లీన్ గా ఉంచాలన్నారు.

 

అనంతరం జిల్లా కలెక్టర్ వేములవాడ లో ఆకస్మికంగా పర్యటన చేసి పురపాలక సంఘం పరిధిలో నంది కమాన్, అయ్యోరు పల్లి, జగిత్యాల రోడ్, మల్లారం
ప్రధాన రహదారుల వెంబడి ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు.

మున్సిపాలిటీ లో పచ్చదనం పెంపుకు ప్ర‌ణాళిక ఉండాల‌ని చెప్పారు. ఖాళీ స్థ‌లాల‌ను గుర్తించి, ప‌చ్చ‌దనం పెంపొందించడం ల‌క్ష్యంగా పెట్టుకోవాల‌న్నారు.
వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు .

ఎండ‌లు తీవ్రంగా ఉన్నందున హ‌రిత‌హారం మొక్క‌ల‌కు వారంలో రెండు, మూడు సార్లు నీటి వ‌స‌తి క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.
మొక్కల సంరక్షణ లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ మున్సిపల్ అధికారులను హెచ్చరించారు.

 

సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య , ఇంజనీరింగు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

——————————

 

Share This Post