కొత్త లోకల్ క్యాడర్ లకు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియపై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన     తేది:24.12.2021, వనపర్తి.

కొత్త లోకల్ క్యాడర్ లకు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కొత్త లోకల్ క్యాడర్ లకు ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు డిసెంబర్ 6 వ తేదీన జారీ చేసిన జి. ఓ. నెంబర్ 317ను అనుసరించి సీనియారిటీ ప్రకారం కేటాయించబడిన జిల్లా క్యాడర్ పోస్టుల జాబితాను సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు.
ఈ నెల 24న సీనియారిటీ జాబితా, 25న కేటాయించబడిన ఉద్యోగుల జాబితా, 26, 27 న ఉద్యోగుల నుండి ఆప్షన్ పత్రాలను స్వీకరించుట, 28, 29న కౌన్సిలింగ్ నిర్వహించుట, 30వ తేదీన ఉద్యోగులకు బదిలీల ఉత్తర్వులు అందించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఉద్యోగుల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. డిసెంబర్ చివరి నాటికి కేటాయింపుల ప్రక్రియ పూర్తి అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వా న్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post