కొత్త సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో పనులు చేపట్టి జిల్లాకు అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆకాంక్షించారు.

జిల్లాలో అధికారులు అందరు గత సంవత్సరము లక్ష్యం మేరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసారని, కొత్త సంవత్సరంలో కూడా రెట్టింపు స్ఫూర్తితో పనులు చేపట్టి జిల్లాకు అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆకాంక్షించారు.

ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సరం -2022 సందర్బంగా జిల్లా కలెక్టర్ను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేసిన జిల్లా అధికారులు, తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బందికి జిల్లా కలెక్టర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం కోవిడ్ కష్ట కాలంలో అధికారులు అందరు మంచి సేవలందించి ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికలు, వైకుంఠ దామాలు, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు లాంటి పనులను సకాలంలో పూర్తి చేసినందుకు ప్రశంసించారు. ప్రస్తుతం కోవిడ్, ఓమిక్రాన్ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నందున అధికారులందరు కోవిడ్ నిబంధనలతో పాటు అన్ని ముందు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండి గత సంవత్సరం కన్న ఎక్కువ ఉత్సాహంతో మంచి సేవలు అందించాలన్నారు. అధికారులు, ఉద్యోగులు అందరు తప్పకుండా వాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు.

అంతకు ముందు తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ వారు ముద్రించిన డైరీ, క్యాలెండర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్యలతో పాటు అందరు జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post