కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కొనుగోలు కేంద్రాల బాధ్యులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఏప్రిల్ 27 ఖమ్మం

కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కొనుగోలు కేంద్రాల బాధ్యులను ఆదేశించారు. బుధవారం కూసుమంచి, కిష్టాపురం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి బాధ్యులకు, అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు. ధాన్యం ఎంత మేర కొనుగోలు చేయడం జరిగిందని ఇంకా ఎంత ధాన్యం రావాల్సి ఉందని రైతులకు చెల్లింపు వివరాలను కలెక్టర్: అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించే ముందు తేమ శాతం సరిచూసుకొని తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకం మిషన్లు, తేన నిర్ధారణ పరికరాలు, గన్నీబ్యాగులు, టార్పాలిన్లను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. వేసవి దృషామియానాలు త్రాగునీరు, విశ్రాంతి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూరన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యావందన, జిల్లా సహాకార శాఖ అధికారి విజయకుమారి, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ సోములు, ఎం.పి.డి.ఓ కరుణాకర్ రెడ్డి, డిటి అన్సారలీ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post