కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే తరలించాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, నవంబరు 29: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే తరలించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు.
సోమవారం బచ్చన్నపేట మండల కేంద్రంలో ఐకెపి ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసి,కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ట్రాక్ షీట్ నమోదును వెంటనే చేపట్టలన్నారు. గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఉంచుకోవాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ధాన్యం వెంట వెంటనే తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో ఉంచాలని అన్నారు. అనంతరం కలెక్టర్ తమ్మడపల్లి కొనుగోలు సెంటర్ ను పరిశీలించి అధికారులు, రైతులతో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా హమలీలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. శీతాకాలం దృష్ట్యా త్వరగా చీకటి పడుతున్నందున రైతుల సౌకర్యార్ధం కొనుగోలు కేంద్రాలలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, డిసిఓ ఆర్.కిరణ్ కుమార్, తహాశీల్దార్ శైలజ, తదితులున్నారు.

Share This Post