*కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వెంట వెంటనే తరలించాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వెంట వెంటనే తరలించాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*ప్రచురణార్థం-1*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 25: రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వెంట వెంటనే తరలించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో ఐకేపీ, గొల్లపెల్లి గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇప్పటివరకు రైతుల వద్ద నుండి ఎంతమేరకు ధాన్యం కొనుగోలు చేశారనే వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. పదిర గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి సంబంధించి 70 మంది రైతుల వద్ద నుండి 5 వేల 844 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, అందులో 4 వేల 878 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి మిల్లులకు తరలించడం జరిగిందని సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. గొల్లపెల్లి గ్రామంలోని ప్యాక్స్ కొనుగోలు కేంద్రానికి సంబంధించి 8 వేల 150 క్వింటాళ్ల ధాన్యం ఇప్పటివరకు సేకరించడం జరిగిందని, అందులో 7 వేల 200 క్వింటాళ్ల ధాన్యం ఇప్పటికే మిల్లులకు తరలించడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. ట్యాబ్ ఎంట్రీ తీరును ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని అన్నారు. సరిపడా గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. దళారులకు ధాన్యాన్ని విక్రయించి మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
*బృహత్ పల్లె ప్రకృతి వనం సందర్శన*
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపెల్లి గ్రామ శివారులోని గాలంగుట్ట మీద ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనంను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మొక్కల పెంపకం, పర్యవేక్షణ, మొత్తం ఎన్ని మొక్కలు నాటారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం మొత్తం కలిపి 20 వేల మొక్కలను ఈ వనంలో నాటడం జరిగిందని సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. గుట్ట ప్రాంతంలో వీలుగా ఉన్నచోట పూల, తీగ జాతి మొక్కలను పెంచాలని సూచించారు. అక్కడే ఏర్పాటు చేస్తున్న నర్సరీలో డిమాండ్ కు అనుగుణంగా మొక్కలు పెంచాలని అన్నారు. మండలంలోని కోరుట్లపేట, సింగారం, అక్కపెల్లి, గుండారం గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాల్లో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్శనలో డీఆర్డీఓ కె. కౌటిల్య, డీసీఓ బుద్ధనాయుడు, ఎంపీడీఓ చిరంజీవి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post