కొనుగోళ్ళను వేగవంతంగా పూర్తిచేయాలి…

కొనుగోళ్ళను వేగవంతంగా పూర్తిచేయాలి…

ప్రచురణార్ధం

కొనుగోళ్ళను వేగవంతంగా పూర్తిచేయాలి…

మహబూబాబాద్, జనవరి,6.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో వరిధాన్యం కొనుగోళ్లు, ఉపకారవేతనాలు మంజూరు, కోవిడ్ లో మృతిచెందిన వారికి పరిహారం చెల్లింపు, ఇసుక రీచ్ ల క్రమబద్ధీకరణ, నిర్వహణ, నాలా దరఖాస్తులు, ధరణి లపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల తహసీల్దార్ లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, విక్రయాలు లేని కేంద్రాలను త్వరగా ముగిన్చేందుకు చర్యలు తీసుకోవాలని, సామాగ్రిని మార్కెటింగ్ శాఖకు స్వాధీనం చేయాలన్నారు.

పాఠశాలలో చదువుతూ అర్హులైన ఎస్సి,ఎస్టీ, మైనారిటీ, వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉపకార వేతనాలు సకాలంలో పొందేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

కోవిడ్ తో మృతి చెందిన వారి దరఖాస్తులు పరిశీలించి సమగ్ర సమాచారంతో నివేదిక అందజేయాలన్నారు.

ఇసుక రీచుల నిర్వహణ కై నెల్లికుదురు, నర్సింహులపేట,తొర్రుర్,దంతాలపల్లి,చినగూడూరు మండలాలలో పక్కాగా నిర్వహించాలని ఉదయం 6 నుండి సాయంత్రం 5లోగా పూర్తి చేయాలన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇసుక రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు.

హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇంటి కోసం తీసుకున్న రుణాలను మాఫీ చేయడం జరిగిందని సంబంధిత శాఖల వద్ద ఉన్న పట్టాలను స్వాధీనపరచాలని కలెక్టర్ ఆదేశించారు.

నాలా కొరకు దరఖాస్తు చేసుకున్న వారిని గ్రామాల వారీగా గుర్తించి నివేదిక సమర్పించాలన్నారు .
ధరణి లో ఏజెన్సీకి సంబంధించిన సక్సేషన్ (వారసత్వం) భూములకు ధరనిలో ప్రభుత్వం అనుమతించినందున వెంటనే చేయాలని కోర్టు కేసులను పరిష్కరిస్తూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.

మండల కార్యాలయాల నుండి కూడా ఉత్తర ప్రత్యుత్తరాలను ఇకపై ఈ ఆఫీస్ ద్వారానే జరగాలని కలెక్టర్ తెలియజేశారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య ఆర్ డి ఓ రమేష్ జిల్లా అధికారులు తహశీల్దార్లు కలెక్టర్ కార్యాలయం పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
——————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ జారీ చేయడమైనది

Share This Post