కొవిడ్-19 (కరోనా) వైరస్ ప్రబలకుండా ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధికారులను ఆదేశించారు. శనివారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ క్యాబినెట్ కార్యదర్శి మాట్లాడుతూ కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టాలని, కరోనా పరీక్షలు నిర్వహించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, కొవిడ్ పాజిటివ్ బాధితులు పూర్తిగా కోలుకునే విధంగా వారికి అవసరమైన మందులు అందించడంతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తలపై తగు సూచనలు, సలహాలు చేయాలని తెలిపారు. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలను గుర్తించి పాజిటివ్ కేసులు పెరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కొవిడ్-19 మూడవ దశ నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఆర్.టి.పి.సి. ఆర్., ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, మందుల కిట్లను సైతం బాధితులకు అందించేందుకు సిద్దంగా ఉంచాలని, వైద్య సేవలలో భాగంగా ఆక్సిజన్ కాన్సన్(ట్రేటర్లు ప్రతి ఆసుపత్రిలో ఉంచాలని, ఆసుపత్రులలో పడకలు, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, మండలాల పరిధిలో వైరస్ వ్యాప్తి చెందకుండా విసృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో కీటక జనిత వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని, దోమల వృధి నిరోధించేందుకు అవసరమైన పారిశుద్ధ్య చర్యలు [గ్రామ స్థాయి నుండి చేపట్టాలని, ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభత ఆవశ్యకత, దోమలు అధికంగా ఉండే ప్రాంతాలలో దోమతెరల వినియోగంపై ప్రజలకు వివరించాలని తెలిపారు. ఆరోగ్య శాఖ, సంబంధిత సిబ్బంది గ్రామాలలో, వార్డులలో ఇంటింటికి తిరుగుతూ రోగులను గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించేలా అధికారులు పర్యవేక్షణ జరుపాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా సంబంధిత శాఖల సమన్వయంతో పారిశుద్ధ్యం, సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, విషజ్వరాల నివారణ కోసం గ్రామాలు, పట్టణాలలో నీరు నిల్వ ఉండకుండా చూడటంతో పాటు చెత్తా, చెదారం ఉండకుండా, మురుగుకాలువలలో పూడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా॥ సుబ్బారాయుడు, ఉప వైద్యాధికారి డా. ఫయాజ్, జిల్లా
సర్వేయలెన్స్ అధికారి డా॥ బాలాజీ, వైద్య విధాన పరిషత్ జిల్లా ఇన్‌చార్జ్ పర్యవేక్షకురాలు డా॥ ఆశ్లేష సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.