కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలో కొవిడ్‌-19 వాక్సినేషన్‌ ప్రక్రియ నంబంధిత శాఖల సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపాలిటీలోని గర్మిళ్ళ ఉన్నత పాఠశాల, రామ్‌నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రం, లక్షైెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామం, హాజీపూర్‌ మండలం దొనబండ, టీకనపల్లి గ్రామాలలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పల్లె, గ్రామం, వార్డులు, పట్టణాలు, డివిజన్ల వారిగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని, జిల్లాలో 149 నబ్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ రెండు డోసులు తగు జాగ్రత్తలు పాటిన్తూ వాక్సినేషన్‌ తప్పనినరిగా తీసుకోవాలని, జిల్లాలో ఇప్పటివరకు 55 శాతంతో 89 వేల మందికి రెండవ రోజు కూడా పూర్తి చేయడం జరిగిందని, ఇంటింటికి వెళ్ళి వ్యాక్సినేషన్‌కు అర్హత గల వారి వివరాలు సేకరించాలని, వ్యాక్సిన్‌ వేసుకునే దిశగా వారిలో అవగాహన కల్పించి 100 శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. వ్యాక్సినేషన్‌పై సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలందరికీ పూర్తిస్థాయిలో తెలిసే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీనుకునే విధంగా చర్యలు తీనుకోవాలని తగు నూచనలు, సలహాలు
చేశారు.

ఈ కార్యక్రమాలలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి నుబ్బారాయుడు,
జిల్లా పరిషత్‌ వైస్ వైర్మన్‌ నత్యనారాయణ, ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, వార్డు కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post