కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, సీజనల్ వ్యాధులు, భూసేకరణ, ప్రాజెక్టుల పనులపై సమీక్షా సమావేశం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన. తేది:29.09.2021, వనపర్తి.

కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, సీజనల్ వ్యాధులు, భూసేకరణ, ప్రాజెక్టుల పనులలో ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆయన సూచించారు. వనపర్తి జిల్లాలో 169 వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకా పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. మొదటి డోసు పూర్తయిన వారు 1 లక్ష 96 వేల 236, రెండవ డోసు పూర్తయిన వారు 51 వేల 281 మందికి వాక్సినేషన్ పూర్తి అయినట్లు ఆయన తెలిపారు.
ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 100% కరోనా వ్యాక్సిన్ వేయించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ పూర్తి చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కొత్తకోట, పెబ్బేరు మండలంలో వాక్సినేషన్ శాతం నమోదు తక్కువగా ఉందని, ముస్లింలకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ శాతం పెంచాలని ఆయన అధికారులకు ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. MGNREGS పనులలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పూర్తిచేయాలని ఆయన వ్యక్తం చేశారు. 11 చెక్ డ్యామ్ లను జస్టిఫికేషన్ చేయాలని, పాన్ గల్ చెక్ డాం పనులు పెండింగ్లో ఉన్నాయని, నెల్విడి, కొత్తకోట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాలలో పనులను పూర్తి చేయాలని, పాలమూరు తొలి ఫలితం ఎదులకే అందుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వైద్యాధికారి ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా బదిలీలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ ఎం.పీ.రాములు మాట్లాడుతూ తమకు ఎప్పటికప్పుడు కనీస సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. ఏజెన్సీల సహకారంతోనే పనులు పూర్తి అవుతాయని ఆయన అన్నారు. ఎత్తిపోతల పథకం పనులలో రూ.57 కోట్ల పెండింగ్ ఉన్నాయని, త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని ఆయన కోరారు. భూసేకరణ పనులలో సమస్యలు ఉన్నాయని, వెంటనే వాటిని పరిష్కరించాలనీ ఆయన తెలిపారు. జాప్యం లేకుండా సమస్యలను పరిష్కరించి నట్లయితే వేపురులో వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ కొత్తకోట, పెబ్బేరు లో వ్యాక్సినేషన్ తక్కువ శాతం నమోదు అయినదని, ప్రజల్లో అవగాహన కల్పించి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, లోకల్ బాడీ అంకిత్, జడ్పీ వైస్ చైర్మన్ వా మన్ గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్యాల రామ్మోహన్ రెడ్డి, సీఈ. రఘునాథరావు, హమీద్ ఖాన్, పెబ్బేరు ఎస్. ఈ. సత్యశీల రెడ్డి, నాగర్ కర్నూల్ ఎస్. ఈ. ఎ. ఎస్. ఎన్.రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ. డాక్టర్ చందు నాయక్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ. డా.శ్రీనివాసులు, డా సౌభాగ్య లక్ష్మి, రామాంజనేయులు, ఇరిగేషన్, ప్రాజెక్టు అధికారులు, ఈ.ఈ.లు, డి.ఈ.లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post