కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ బాలికలకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక

గ్రామీణ బాలికలు విద్యలో రాణించాలి

జడ్పీ సీఈఓ ప్రియాంక కర్ణన్

ప్రతిభ చూపిన బాలికలకు నగదు పురస్కారాలు

00000

గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న బాలికలు విద్యలో రాణించాలని, ప్రతిభా పాటవాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి ప్రియాంక కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ బాలికలకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జిల్లాలోని 50 జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నుంచి ఎంపిక చేసిన, 9 వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు మొదటి బహుమతి గా రూపాయలు 5,000, రెండవ బహుమతి గా రూపాయలు 3500 నగదుతో పాటు ప్రశంసాపత్రాలను ప్రియాంక కర్ణ న్ అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్యతరగతి బాలికలే చదువుతారని వారిని ప్రోత్సహించేందుకు కోరమండల్ సంస్థ ప్రతియేటా ప్రతిభా పురస్కారాలను ఇవ్వడం అభినందనీయమని అన్నారు. వచ్చే ఏడాది నుంచి పురస్కారాల నగదును పెంచాలని కోరమండల్ సంస్థకు సూచించారు. ప్రతిభా పురస్కారాల వల్ల ఇతర బాలికలు స్ఫూర్తి పొంది చదువులో రాణించే అవకాశం ఉంటుందని అన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ తో చదువు ఆపేయకుండా ఉన్నత చదువులు చదవాలని విద్యార్థినులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ జోనల్ మేనేజర్ సాజన్ కుమార్, ఉపాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, కేవీ శ్రీనివాసరావు, అలీ తదితరులు పాల్గొన్నారు.

Share This Post