ప్రచురణార్థం
కోరిక కంటే పట్టుదల ముఖ్యం, కష్టంలోనే భవిష్యత్తు దాగి ఉన్నది … జిల్లా కలెక్టర్ కె. శశాంక.
తొర్రూర్,
మహబూబాబాద్ జిల్లా, మే -09:
కోరిక కంటే పట్టుదల గొప్పదని, కష్టంలోనే భవిష్యత్తు దాగి ఉందని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు.
సోమవారం ఉదయం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు అనుభవజ్ఞులైన నిపుణులచే టెట్, డీఎస్సీ, కానిస్టేబుల్, ఎస్ఐ వివిధ రకాల గ్రూప్స్ పోటీ పరీక్షల సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా శిబిరానికి జిల్లా కలెక్టర్ కె. శశాంక ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అవకాశాలు రావడమే గొప్పని, దాన్ని వినియోగించుకున్న వారే సమాజంలో ముందు వరుసలో ఉంటారని, విద్య తరగని గని అని ఒక దీపం కోటి దీపాలను వెలిగించినట్లు గా ఆత్మస్థైర్యంతో, కృషి, పట్టుదలతో చదవాలని, గత వాటి గురించి పోల్చుకో కూడదని, ఆలోచనా విధానంతో పాటు నిర్ధిష్టమైన లక్ష్యం ఉండాలని తెలిపారు.
మంచి సేవాభావంతో ఉచిత కోచింగ్ అందిస్తున్నందుకు యువకులు సద్వినియోగం చేసుకోవాలని, వేరే కోచింగ్ సెంటర్ లకు ధీటుగా మంచి ఫ్యాకల్టీ తో క్లాసులు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు కృషి చేస్తున్నారని, ఎగ్జామ్ ప్యాట్రన్ లో ఏవి చదవకూడదు, ఏమి చదవాలో అవగాహన కలిగి ఉండాలని, అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైన అప్పటి నుండి ప్రతి అంశాన్ని కూలంకషంగా చదవాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదవగల మని ఏకాగ్రత, మనసు, ఆరోగ్యం ముఖ్యమని, వ్యాయామం తప్పనిసరియని, జ్ఞానం సంపాదించడం వేరు ఎగ్జామ్ రాయడం వేరని, ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ చాలా ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఎనభై ఒక్క వేల ఉద్యోగాల జాబితాలో జిల్లాకు 1172 పోస్ట్లు ఉన్నాయని, మల్టీ జోన్ల విధానంలో అవకాశాలు ఉన్నాయని, ఈ కోచింగ్ ను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తులో స్థిరపడి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని తెలిపారు.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలకు మేలు కలిగే విధంగా నిస్వార్థంగా కోచింగ్ సెంటర్ ను తోర్రుర్ ప్రాంతంలో ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు, అందరూ నిరుద్యోగులు వినియోగించుకోవాలని, కరోన సమయంలో ఎంతోమందిని అదుకున్నామని, కష్టపడితేనే ఫలితం ఉంటుందని, వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ఆర్ధికంగా కోచింగ్ ల పేర్ల తో నష్టపోకూడదని, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా జీవితాంతం ప్రజలకు సేవలందిస్తామని, ఉచిత కోచింగ్ తో పాటు మధ్యాహ్న భోజనం, స్టడీ మెటీరియల్ ను అనుభవజ్ఞులైన, నిపుణులచే తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిలబస్ పై అవగాహన కల్గి ఉండాలని, సమయ భావo పాటిస్తూ, ఇక్కడ చెప్పే ప్రతి అంశాన్ని జాగ్రత్తతో విని ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా శ్రమించి భవిష్యత్తులో స్థిరపడాలని, ఈ ప్రాంతానికి పేరు ప్రతిష్ఠలు తేవాలని, గతంలో పాలకుర్తి, తొర్రూర్ లలో కోచింగ్ సెంటర్ల ద్వారా 7 గురు ఎస్సైలు, 320మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని, ఆత్మస్థైర్యంతో చదివి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఉషాదయాకర్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం పి పి చిన్న అంజయ్య, జెడ్పిటిసి శ్రీనివాస్, పి ఏ సి ఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రాం చంద్రయ్య, వైస్ ఎంపీపీ శ్యామ్ సుందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి దేవేందర్ రెడ్డి,రూరల్ డెవలప్మెంట్ కమిషన్ మెంబర్ వెంకట్నరాయణ, జయశంకర్ కోచింగ్ సెంటర్ ప్రతినిధి చారి, వివిధ స్థాయి పార్టీ శ్రేణులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.