కోర్టు కేసులకు సకాలంలో కౌంటర్ ఫైల్స్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తహసిల్దారులను ఆదేశించారు

. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో రెండు పడకల ఇండ్ల నిర్మాణాలు, వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం చెల్లింపులు, ధరణి, ఇసుక, మట్టి రవాణా, బృహత్ పకృతి వనాలకు భూ కేటాయింపులు, రేషన్ దుకాణాలు, ధాన్యం కొనుగోళ్లు, కళ్యాణలక్ష్మి, షాదిముభారక్, ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణ, ప్రజావాణి పిర్యాదులు పరిష్కారంపై రెవిన్యూ, పంచాయతీరాజ్, గిరిజన ఇంజనీరింగ్ విభాగం, పౌర సరఫరాలు, మైనింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసులకు సకాలంలో కౌంటర్ ఫైళ్లు దాఖలు చేయుటపై కలెక్టరేట్లోని లీగల్సెల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్జేకు సూచించారు. కౌంటరైళ్లు దాఖలు చేయడంలో స్పష్టంగా అర్థమయ్యే విధంగా దాఖలు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిరుపేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండలస్థాయిలో రేషన్దుకాణ డీలర్లుతో సమావేశం నిర్వహించి బియ్యం సక్రమంగా పంపిణీ జరిగే విధంగా చూడాలని చెప్పారు. మండలస్థాయిలో పౌర సరఫరాల నాయబ్ తహసిల్దార్లు రేషన్ బియ్యం పంపిణీలను తనిఖీ చేయాలని చెప్పారు. ఈ నెల 15వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, సకాలంలో బియ్యం పంపిణీ చేయని చేయని డీలర్లుపై కేసులు నమోదుతో పాటు లైసెన్సు రద్దు చేస్తామని, ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లు నియామకం చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కళ్యాణలక్ష్మి దరఖాస్తులు 782 పెండింగ్లో ఉన్నాయని, చెక్కులు పంపిణీ కొరకు సంబంధిత శాసనసభ్యుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పారు. రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి ఇసుక సమస్య లేకుండా చూడాలని, ఇట్టి సమస్యను తక్షణమే పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డకు సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇండ్లు లబ్దిదారులకు కేటాయించాలని చెప్పారు. రెండు పడక గదుల ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పనకు నిధులు మంజూరు చేశామని, యుటిలైజేషన్ ధృవీకరణ అందచేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లను కేటాయించుటకు గ్రామసభలు నిర్వహించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని, నిరుపయోగంగా ఉంచడం వల్ల ఉపయోగం లేదని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పనకు నిధులు మంజూరు చేసామని, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల నిరుపయోగం ఉంటున్నాయని చెప్పారు. ధరణిలో వచ్చిన దరఖాస్తులను రానున్న మంగళవారం వరకు పరిష్కరించాలని చెప్పారు. ధరణి నిరంతర ప్రక్రియని, దరఖాస్తులు పరిష్కారంలో జాప్యం చేయొద్దని పేర్కొన్నారు. నూతన ఇసుక రీచ్లు ఏర్పాటుకు తహసిల్దారులు ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని తెలిపారు. ఇసుక దందాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బృహాత్ పకృతి వనాలు ఏర్పాటుకు గుర్తించిన భూములను తక్షణమే యంపిడిఓలకు అప్పగించాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు గురించి ప్రస్తావిస్తూ కొనుగోలు కేంద్రాలను తహసిల్దారులు తనిఖీ చేయాలని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలున్న దాన్యం కొనుగోళ్లులో జాప్యం లేకుండా చూడాలని చెప్పారు. కొత్తగూడెం పట్టణంలో ప్రభుత్వ ఉత్తర్వులు 76 ప్రకారం ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని తహసిల్దార్ను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని చెప్పారు.

 

ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ అశోకచక్రవర్తి, పంచాయతీరాజ్ ఈఈ సుధాకర్, గిరిజన ఇంజనీరింగ్ విభాగం ఈఈ రాములు, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, మైనింగ్ ఏడి జయ సింగ్, ఏఓ గన్యా, అన్ని మండలాల తహసిల్దారులు, నాయబ్ తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post