కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పది కోర్టుల భవన సము దాయమును సత్వరమే పూర్తి చేసీ అందుబాటులో కి తీసుకుని రావాల్సిందిగా కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

గురువారం నాడు సాయంత్రం కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు, వరంగల్ జిల్లా మున్సిపల్ కమిషనర్ కుమారి ప్రావీణ్య పది కోర్టుల భవన సముదాయాలను ,పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్ట్ భవనాలకు 22 కోట్ల రూపాయల తో నిర్మిస్తున్నారని తెలిపారు. మిగిలిన పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు ఆవరణలో పలు రకాల మొక్కలు నాటాలని సూచించారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఉండాలని అన్నారు

Share This Post