కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పది కోర్టుల భవన సము దాయమును యుద్దప్రాతి పదికన పూర్తి చేయాలని ర కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.

శనివారం నాడు హనుమకొండ వరంగల్ కలక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపీ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు, కమీషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషీ పది కోర్టుల భవన సముదాయాలను ,పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్ట్ భవనాలకు 22 కోట్ల రూపాయల తో నిర్మిస్తున్నారని తెలిపారు. మిగిలిన పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు ఆవరణలో పలు రకాల మొక్కలు నాటాలని సూచించారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఉండాలని అన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ వాసుచంద్ర, డిసిపి పుష్ప, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Share This Post