కోర్టు భవనాలను ప్రారంభించిన హై కోర్టు జడ్జి


సత్వర న్యాయ సేవలు అందించడమే లక్ష్యం::రాష్ట్ర హై కోర్టు జడ్జీ గౌరవ డా. షమీమ్ అక్తర్.
40 సంవత్సరాల కల సాకారం.
పెండింగ్ కేసులు పరిష్కారానికి అడ్వకైట్లు కృషి చేయాలి.
అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మరియు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ప్రారంభించిన రాష్ట్ర హై కోర్టు జడ్జి.
పెద్దపల్లి , నవంబర్ 20:- ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా న్యాయవాదులు, న్యాయ శాఖ అధికారులు పనిచేయాలని రాష్ట్ర హై కోర్టు జడ్జీ గౌరవ డా. షమీమ్ అక్తర్ తెలిపారు. శనివారం రంగంపల్లిలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు భవనం మరియు పోక్సో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆయన ప్రారంభించారు. జిల్లాలో కోర్టు భవనాల ప్రారంభానికి విచ్చేసిన హై కోర్టు జడ్జికు సినియర్ సవిల్ జడ్జి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం అందజేయగా, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం కోర్టు ఆవరణలో హైకోర్టు జడ్జీ సర్వ మత ప్రార్థన నిర్వహించి, కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం హై కోర్టు జడ్జీ రిబ్బన్ కట్ చేసి అదనపు జిల్లా సెషన్ కోర్టు మరియు పోక్సో కేసుల పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆయన ప్రారంభించారు. అనంతరం హై కోర్టు జడ్జీ మాట్లాడుతూ 1981 నుంచి పెద్దపల్లి లో అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటుకు డిమాండ్ ఉందని, దీనిని ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటిని ప్రారంభించడానికి రాష్ట్ర హై కోర్టు అనుమతించడంతో నేడు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. 40 సంవత్సరాల కల సాకారమవుతూ నేడు జిల్లాలో 2 కోర్టులను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు 1000 కంటే అదనంగా కేసులు పెండింగ్ లో ఉన్న ప్రాంతంలో అదనపు సెషన్స్ కోర్టుల ఏర్పాటు చేయడానికి సిఫార్సు చేసామని, దాని ప్రకారం పెద్దపల్లిలో అదనపు సెషన్స్ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించే దిశగా న్యాయవాదులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గత 1.5 సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో కోర్టు నిర్వహణ వరుచవల్ గా మాత్రమే జరిగిందని, ఇటీవలె తిరిగి కోర్టులు ఫిజికల్ గా ప్రారంభమవుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 2 కోర్టు భవనాలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి బార్ అసోసియెషన్, న్యాయవాదుల పై బాధ్యత పెరిగిందని, వారు మరింత కఠోర శ్రమ చేయాల్సి ఉంటుందని అన్నారు పెండింగ్ లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం చెసే దిశగా అవసరమైన పత్రాలు, ఆధారాలు సమర్పిస్తే సంబంధిత కేసు ప్రొసిడింగ్స్ త్వరగా ముగించడానికి వీలుంటుందని తెలిపారు. దేశంలో ప్రజలకు న్యాయ సేవలు అందడంలో కొంతమేర ఆలస్యం జరుగుతుందని, కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచుపులతో ఉన్నారని ఆయన తెలిపారు. బార్ అసోసియెషన్ సభ్యులు పెండింగ్ కేసుల త్వరగా పరిష్కరించడానికి కంకణబద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో 2 కోర్టుల ప్రారంభొత్సవ కార్యక్రమంలో పాల్గోనే విధంగా కృషి చేసిన జిల్లా బార్ అసోసియెషన్ అధ్యక్షులు రమణారెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మణ్ కుమార్ లకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అనంతరం పెద్దపల్లి బార్ అసోసియెషన్ సభ్యులు హైకోర్టు జడ్జిని సన్మానించారు

ఉమ్మడీ కరీంనగర్ జిల్లా జడ్జీ ప్రియదర్శీని, పెద్దపల్లి సినియర్ సివిల్ జడ్జీ డి. వరూధిని, జిల్లా బార్ అసోసియెషన్ అధ్యక్షుడు రమణా రెడ్డి,  రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మణ్ కుమార్,గాగిరెడ్డి మల్లారెడ్డి, బాస్కర్ మంథని బార్ అసోసియెషన్ అధ్యక్షుడు  హరిబాబు, డిసిపి రవీందర్, సంబంధిత అధికారులు, అడ్వకేట్లు, న్యాయవాదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

Share This Post