కోర్ట్ భవన సముదాయం ను సత్వరమే పూర్తి చేయాలని అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నవీన్ రావు ఆదేశించారు.

సోమవారం నాడు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నవీన్ రావు హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కోర్టు భవన నిర్మాణాల పనులు పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. పార్కింగ్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్మించాలని, నిర్మణ పనులు అధికారులు పర్యవేక్షీంచాలనీ అన్నారు. మొక్కలను విస్తృతంగా నాటాలని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదాలత్ కోర్ట్ నుంచి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ కుమారి ప్రావీణ్య డీఆర్వొ వాసుచంద్ర, జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు.

 

Share This Post