కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన పిల్లల ఆలనా, పాలన వారి భద్రత ప్రభుత్వం చూసుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు.

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన పిల్లల ఆలనా, పాలన వారి భద్రత ప్రభుత్వం చూసుకుంటుందని జిల్లా కలెక్టర్
ఎస్. వెంకటరావు తెలిపారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి సంరక్షకుల సంరక్షణలో పెరుగుతున్న పిల్లలతో, వారి సంరక్షకులతో సమావేశమయ్యారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా జిల్లాలో సుమారు 14 మంది పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోగా, ప్రభుత్వం వారికి ప్రతి నెల 4 వేల రూపాయలు చొప్పున స్పాన్సర్షిప్ ఇస్తున్నదని ,దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని ఆయన కోరారు. కొంతమంది పిల్లలు హోమ్ లో ఉన్నారని తెలుసుకొని హోం నిర్వాహకులు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిల్లలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్ తో కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తామని ఆయన చెప్పారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, సి డబ్ల్యూ సి చైర్మన్ నయిముద్దీన్, జిల్లా సంక్షేమ అధికారిని జరిన బేగం, బి ఆర్ బి కో ఆర్డినేటర్ వెంకటమ్మ, సభ్యులు గన్నోజు చంద్రశేఖర్ ,చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నర్మద, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

 

Share This Post