కోవిడ్ కారణంచేత తల్లి మరియు తండ్రిని కోల్పోయిన ఒక కుటుంబానికి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పాస్ పుస్తకం మరియు ఆయుష్మాన్ భారత్ వైద్య భీమా కార్డు అందించారు. కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

కోవిడ్ మహమ్మారి కారణంగా ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులను సంరక్షకులు కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో  ప్రారంభించారు. కరోనా సమయంలో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఈ పథకం కింద ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు.

అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి ఉదయ్ కుమార్  కోవిడ్ కారణంచేత తల్లి మరియు తండ్రిని  కోల్పోయిన  ఒక కుటుంబానికి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పాస్ పుస్తకం మరియు ఆయుష్మాన్ భారత్ వైద్య భీమా కార్డు అందించారు.

వారితో కలెక్టర్

మాట్లాడుతూ పిల్లలకు 18 ఎళ్లు నిండేసరికి వారి పేరిట 10 లక్షల సొమ్ము డిపాజిట్ చేస్తారని, 18 నుండి 23 ఏళ్ల వయసు వరకు ఆ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ వారికి ప్రతి నెలా స్టైఫండ్ రూపంలో అందిస్తారని తెలపడం జరిగింది.  23 ఏళ్ల నిండిన తర్వాత పూర్తిగా లబ్దిదారులకు ఇచ్చే విధంగా పీఎం కేర్ పోర్టల్ లో పొందుపరిచారు.

ఇట్టి కార్యక్రమానికి శ్రీ శిశు సంక్షేమ అధికారి టి యు వెంకట లక్ష్మి , జిల్లా బాలల సంరక్షణ అధికారి నిరంజన్  మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మన్ రావు  డి సి పి యు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది

Share This Post