కోవిడ్ కేసులను తగ్గించాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

కోవిద్ కేసులను తగ్గించాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 2.

జిల్లాలో కోవిద్ కేసులను తగ్గించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో కోవిద్ నియంత్రణ హాస్పిటల్స్ నిర్వహణ లపై కలెక్టర్ వైద్య అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 121 కోవిద్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు కోవిద్ ఎక్కువ ఉన్న ప్రాంతాలైన కేసముద్రం బయ్యారం కురవి మరిపెడ తదితర మండలాల్లో వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా గార్లలో 9 హై రిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు టెస్ట్ లక్ష్యాలను పెంచాలన్నారు అదేవిధంగా వాక్సినేషన్ కూడా పెంచాలన్నారు వ్యాక్సినేషన్ వినియోగంపై ప్రజలకు తెలియజేస్తూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 2 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఏరియా హాస్పిటల్స్ నిర్వహణపై సమగ్రంగా సమీక్షించారు శానిటేషన్ మెరుగుపరచాలని వైద్య అధికారులకు సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు ఏరియా ఆస్పత్రి కోఆర్డినేటర్ వెంకట్ రాములు డి పి ఓ రఘువరన్ జిల్లా మలేరియా అధికారి సుధీర్ రెడ్డి ఉప వైద్యాధికారి అంబరీష కోవిద్ నోడల్ అధికారి విక్రమ్ ఇంజనీరింగ్ అధికారులు ఉమా మహేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు
————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post