కోవిడ్ టీకా తీసుకొనని వారికి ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపోర్టుతో అనుమతి :జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

కోవిడ్ టీకా తీసుకొనని వారికి ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపోర్టుతో అనుమతి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
-000-

హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, డ్రైవర్ మొదలగు వారు కోవిడ్ టీకా ప్రోటోకాల్ ప్రకారం మొదటి డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారు , రెండవ డోసుకు అర్హత లేని వారు, పోలింగ్, కౌంటింగ్ తేదీలకు 72 గంటల లోపు ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపొర్టు సమర్పిస్తే అనుమతిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒక డోసు కూడా కోవిడ్ టీకా తీసుకోకుండా ఉన్న అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, డ్రైవర్ మొదలగు వారు పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియకు 48 గంటల లోపు ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపోర్టు సమర్పిస్తే అనుమతిస్తామని తెలిపారు.

Share This Post