కోవిడ్ తీవ్రత, ఓమిక్రాన్ నేపథ్యంలో 15-18 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌తో పాటు 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్, హెల్త్ కేర్ వర్కర్స్,  ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్ నేటి నుండి అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

జనవరి 10 ఖమ్మం

కోవిడ్ తీవ్రత, ఓమిక్రాన్ నేపథ్యంలో 15-18 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌తో పాటు 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్, హెల్త్ కేర్ వర్కర్స్,  ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్ నేటి నుండి అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు నేటి నుండి అందిస్తున్న బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. కోవిడ్ తీవ్రత మరల పెరుగుతున్న దృష్ట్యా ప్రజల ఆరోగ్య సంరక్షణకు 18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని దీనితో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్స్, సీనియర్ సిటిజన్స్ కు  కోవిడ్- 19 టీకాలు రెండు డోస్ లు తీసుకున్న వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి బూస్టర్ డోస్‌ను అందిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ బూస్టర్ డోన్ల కోసం నగరంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు మామిళ్ళగూడెం, ముస్తఫా నగర్, శ్రీనివాసనగర్, వెంకటేశ్వర నగర్‌లతో పాటు ఉమెన్స్ కాలేజ్, గాంధీచౌకిలోని ప్రభుత్వ పి.జి కళాశాల, ఎన్.టి.ఆర్ సర్కిల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శాంతి నగర్ కళాశాల, అంబేద్కర్ గురుకుల కళాశాలల్లో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా జిల్లాలోని హెల్త్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వారియర్స్, 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కు కోవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకొని నిర్దేశిత గడువు ముగిసిన వారికి బూస్టర్ డోస్‌ను అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనితో పాటు 15-18 సంవత్సరాల లోపు ప్లిలలకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లాలో జరుగుతుందన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ను తీసుకున్నారు. అనంతరం హెల్త్ వర్కర్లు, సీనియర్ సిటిజన్స్ కు  బూస్టర్ డోస్, 16-18 సంవత్సరాల లోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలను వేయడం జరిగింది.

నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥ వెంకటేశ్వర్లు, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post