కోవిడ్ తో విచ్ఛిన్నమైన కుటుంబాలకు బాసటగా నిలవాలి…

ప్రచురణార్థం

కోవిడ్ తో విచ్ఛిన్నమైన కుటుంబాలకు బాసటగా నిలవాలి…

మహబూబాబాద్, 2021 నవంబర్ -01:

కోవిడ్  మూలంగా నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని, మానవీయతతో ఆదుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు.

సోమవారం పట్టణంలోని ఐ.ఎం.ఏ. హాల్ లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేర్ స్వచ్ఛంద సంస్థ అందించిన కిట్స్ ను అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్ కుమారి ఆంగోత్ బిందు తో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్  మూలంగా నిరుపేద కుటుంబాలలో సంపాదనపరులను కోల్పోవటం ,ఉమ్మడి కుటుంబాలకు దూరం కావటం, సంపాదనకై వలస రావడం వంటి కారణాలతో ఆర్థికంగా చిన్నాభిన్నం అయ్యాయన్నారు.  స్వచ్ఛంద సంస్థలు, దాతలు మరింత మంది ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. జిల్లా పూర్తిగా 90 శాతం గ్రామీణ ప్రాంతమని, అందులోనూ గిరిజన జనాభా ఎక్కువ గల జిల్లాగా ఉందని, నిరుపేదలు ఎక్కువగా ఉన్నారన్నారు.

కోవిడ్  తగ్గుముఖం పట్టింది అనుకునే లోగా రెండవ దశ ప్రారంభం అయిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉధృతం చేశాయని, జిల్లాలో 85% వ్యాక్సినేషన్ అయిందని, 37 శాతం 2వ డోసు కూడా పూర్తయిందని, 152 కేంద్రాలలో 2600 సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్నారని, వ్యాక్సినేషన్ కార్యక్రమ విశిష్టతను గ్రామాలలో తెలియజేస్తూ 100% వ్యాక్సిన్ అయ్యే విధంగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. పౌష్టికాహార లోపాలను అధిగమించేందుకు పుట్టిన నుండి మూడు నెలల లోపే బలవర్ధకమైన ఆహారాన్ని అందివ్వాలని తద్వారా శిశువు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు.

జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు మాట్లాడుతూ తాను నిరుపేదల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని, వారికి రక్షణగా నిలిచి స్వగ్రామాలకు పంపించామన్నారు. కోవిడ్  సాధారణ జీవనాన్ని కోల్పోయేలా చేసిందని, నిరుపేదలు అందరూ ఆర్థికంగా నిలదొక్కుకుని జీవించేందుకు చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, బాలల పరిరక్షణ కమిటీ చైర్ పర్సన్ నాగ వాణి, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనిన, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పద్మ, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post