కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాభ్యాసం కొనసాగించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

సెప్టెంబర్ 13, 2021ఆదిలాబాదు:-

విద్యాలయంలో చదువుకునే విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యాభ్యాసం కొనసాగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం రోజున స్థానిక కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ రోజు నుండి పునః ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల హాజరు, పారిశుధ్య కార్యక్రమాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంలో ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా విద్యాసంస్థలు మూతబడి ఆన్ లైన్ ద్వారా విద్యాభ్యాసం కొనసాగించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ విద్యాభ్యాసం కొనసాగించాలని అన్నారు. విద్యాలయంలో తరగతి గదులను పరిశీలించి, పురపాలక సంఘం పారిశుధ్య కార్మికుల ద్వారా పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వర్షపు నీటి నిల్వలు ఉండకుండ చూడాలని, ప్రతి తరగతి గదిని, విద్యాలయ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయించాలని అన్నారు. విద్యార్థులు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించి విద్యాభ్యాసం కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రంజనా ఝా, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post