కోవిడ్ నిబంధనల మేరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 12, 2021ఆదిలాబాదు:-

75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన స్టాల్ లు, శకటాల ప్రదర్శన, బాల బాలికల చే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ సందర్బంగా వివిధ శాఖల అధికారులకు విధులు కేటాయించడం జరిగిందని, నిర్ణిత సమయంలోగా పనులను పూర్తీ చేయాలనీ అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పరేడ్ నిర్వహణ, డెకరేషన్ వంటి పనులు నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు ఎన్.నటరాజ్, ఎం.డేవిడ్, అదనపు ఎస్పీ వినోద్ కుమార్, రాజస్వ మండల అధికారి జాడి రాజేశ్వర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post