కోవిడ్ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించి , వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కల్లెక్టర్లకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన.                                                                        తేదీ: 20-01-2022

కోవిడ్ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించి , వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కల్లెక్టర్లకు ఆదేశించారు.

గురువారం : హైదరాబాద్ నుండి పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ల తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమీషనర్ లు, పంచాయత్ రాజ్ అధికారుల తో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీం లను ఏర్పాటు చేసి ప్రతిరోజు 25 ఇండ్లలో ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో సంబంధిత ఆశా వర్కర్, ఏ.ఎన్.ఎం, మున్సిపల్ మరియు  గ్రామ పంచాయతి సిబ్బందితో టీం లను ఏర్పాటు చేయాలని, సర్వే టీంలు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ఎవరైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అడిగి తెలుసుకోవాలని, కోవిడ్ లక్షణాలున్న వారందరికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేయాలని అన్నారు. 5 రోజులు వాడితే సరిపోతుందని ఆయన తెలిపారు. ఐసోలేషన్ కిట్ ఇచ్చిన వారిని సర్వే టింలు ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులలో చేర్పించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ ఓ.పి. సేవలు అందించాలని, కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. 15-18 సంవత్సరముల వారికి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని అర్హులైన వారందరికి వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలని అన్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ ఓ.పి. సేవలను నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టెస్టింగ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్, మందుల నిల్వలు ఉన్నాయని, లేనిచో వెంటనే ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యంతో పాటు  కోవిడ్ వార్డులను ఏర్పాటు చేయాలనీ  తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లతో రివ్యూ చేయాలని ఆదేశించారు. కోవిడ్ రోగులకు మంచి పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని ఆదేశించారు. పోలిస్ కమిషనర్లు, ప్రజలందరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా లో జాతరలు, బోనాలు వీలైనంత వరకు తగ్గించాలని  , జిల్లా  లో ఐసోలేషన్ వార్డ్ ను ఏర్పాటు చేసి పెట్టుకోవాలన్నారు. కలెక్టర్లు, పట్టణ  ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, గ్రామాల్లో పంచాయతి అధికారులు  సమన్వయము తో  100 శాతం  వ్యాక్సినేషన్  పూర్తి అయ్యేలా చూడాలని,  ప్రతి రోజు రిపోర్ట్ పంపించాలని తెలిపారు.

రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫిసర్ ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా, ఏ.ఎన్.ఎం.లతో గ్రామ పంచాయతి కార్యదర్శి, ఇతర అధికారుల సమన్వయంతో ఇంటింటి జ్వరం సర్వేను విజయవంతం చేయాలని అన్నారు.

రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ఇంతవరకు కోవిడ్ తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించే ఎక్స్ గ్రేషియా (ఆర్థిక సహాయం) త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్స్ గ్రేషియా మంజూరుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఉన్నావని, మీ సేవ ద్వారా ధరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో ఉన్న రోగులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్సు లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ,  ప్రతి పి హెచ్ సి లలో  ప్రతి వార్డ్ , గ్రామ పంచాయతిలలో స్పెషల్ ఫోకస్ పెట్టి  వ్యాక్సినేషన్ చేస్తునామని, జిల్లా లో 130 ఆక్సిజన్ బెడ్స్, మరియు covid బెడ్స్ కూడా  రెడీ గా ఉంచామని ,  మొదటి డోసు 100 శాతం  వ్యాక్సినేషన్  పూర్తి  చేసామని , హెల్త్ కేర్, ప్రంట్ లైన్  వర్కర్స్ కు బూస్టర్ డోస్ వేస్తున్నామని ,పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియా కు సంబందించిన అప్లికేషన్ల ను రెండు రోజులలో పంపిస్తామని తెలిపారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ శశికళ, డి.ఎల్.పి.ఓ వెంకట్ రెడ్డి , మున్సిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్ , తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల్  గారి చే  జారీ చేయనైనది.

Share This Post