కోవిడ్ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు తెలిపారు.

గురువారం హైదరాబాద్ నుండి  కోవిడ్ నియంత్రణకు ఇంటింటి సర్వే నిర్వహణ, వాక్సినేషన్ ప్రక్రియ, ఐసో లేషన్ కేంద్రాలు  ఏర్పాటు తదితర అంశాలపై రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, టీఎస్ ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,  సీఎస్ సోమేశ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని చెప్పారు.అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ ఓ.పి. సేవలు అందించాలని చెప్పారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని, లక్షణాలున్న వ్యక్తులకు హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందచేయాలని చెప్పారు. వ్యాధి సోకిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి పై రోజు వారీ పరిశీలన చేయాలని చెప్పారు.  గ్రామాలలో, మున్సిపాలిటీలలో  వార్డుల వారీగా టీము లను ఏర్పాటు చేసి ప్రతిరోజు  ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా వర్కర్/ ఏ.ఎన్.ఎం, మున్సిపల్/ గ్రామ పంచాయతి సిబ్బందితో మల్టీ పర్పస్ టీములను  ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సర్వే టీంలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలో ఎవరైన లక్షణాలతో  బాధపడుతుంటే హోం ఐసోలేషన్ కిట్స్ అందచేసి మందులు ఏ విదంగా వినియోగించాలో తెలియ చేయడంతో పాటు కర పత్రం అందచేయాలని చెప్పారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ లోని మందులు వ్యాధికి సంజీవినిగా  పనిచేస్తున్నాయని, 5 రోజులు వాడితే సరిపోతుందని చెప్పారు. ఐసోలేషన్ కిట్ ఇచ్చిన వారిని సర్వే టింలు ప్రతిరోజు  ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే  వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్పించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే తో వ్యాధి వ్యాప్తిని బాగా కట్టడి చేశారని అదే స్ఫూర్తితో మళ్ళీ ఇంటింటి సర్వే చేయాలని చెప్పారు. ఇంటింటి సర్వే ప్రక్రియను నీతి ఆయోగ్ సైతం అభినందించారని చెప్పారు. కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. రెండవ డోస్ కోవిడ్ బూస్టర్ డోస్, టీ నేజర్ల  వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో   అదే విధంగా 15-17 సంవత్సరముల వారికి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని అర్హులైన వారందరికి వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలని అన్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ ఓ.పి. సేవలను నిర్వహించాలని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలున్న వారందరికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టెస్టింగ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్, మందుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, లేనిచో వెంటనే ముందస్తుగా  నిల్వలు కొరకు ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యంతో కోవిడ్ వార్డులను సిద్ధం చేసినట్లు  తెలిపారు. హోం కీట్స్ పంపిణీ పై ప్రతి రోజు నివేదికలు అందచేయాలని చెప్పారు.  కోవిడ్ సోకిన వ్యక్తులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని ఆదేశించారు. పోలిస్ అధికారులు మాస్కులు ధరించని వారికి జరిమానా విధించాలని  సూచించారు.

రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫిసర్ ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా/ ఏ.ఎన్.ఎం.లతో గ్రామ పంచాయతి కార్యదర్శి, ఇతర అధికారుల సమన్వయంతో ఇంటింటి జ్వరం సర్వేను విజయవంతం చేయాలని అన్నారు. పట్టణాలలో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్నదని ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు.

రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ  కోవిడ్ తో మరణించిన  కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించు ఎగ్జి గ్రేషియా (ఆర్థిక సహాయం) ప్రక్రియ త్వరగా పూర్తి  చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్స్ గ్రేషియా మంజూరుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షుడిగా ఏర్పాటు చేసిన కమిటీలో, జిల్లా వైద్యాధికారి, ఆసుపత్రుల సమన్వయ అధికారి సభ్యులుగా ఉంటారని తెలిపారు. మీ సేవలో ధరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరుకు పోర్టల్ లో అప్ డేట్ చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో ఉన్న రోగులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. కోవిడ్ మరణించిన కుటుంబాలకు 50 వేలు ఆర్థిక సాయం వస్తుందని జాప్యం చేయక తక్షణమే ఆన్లైన్ పూర్తి చేయాలని చెప్పారు.  ఆ కుటుంబాలను నగదు ఎంతో అవసరమని చెప్పారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందింస్తున్నామని చెప్పారు. గతంలో. మీ అందరి సహకారంతో బాగా పని చేశామని, అదే స్ఫూర్తితో ప్రజలను వ్యాధి నుండి కాపాడాలని చెప్పారు.

 

జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆసుపత్రిలో ఆక్సీజన్ కాన్సెంటేటర్లు, ఆక్సజిన్ సీలిండర్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.  జిల్లాలో వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహణకు 1.15 లక్షల రాపిడ్ కిట్స్, 58 వేల హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. మణుగూరు ఆసుపత్రిని ఐసోలేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  జిల్లాలో మొదటి డోస్ వాక్సిన్ ప్రక్రియ 105 శాతం చేశామని, 2వ డోస్ 82 శాతం, టీ నేజర్లకు 57 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు.   అన్ని వాక్సిన్ ప్రక్రియను ఈ నెలలో పూర్తి చేస్తామని చెప్పారు.  జిల్లాలో కోవిడ్ మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందుంచేందుకు పెండింగులో ఉన్న అన్ని దరఖాస్తులు 2 రోజుల్లో పోర్టల్ లో  అప్ లోడ్ చేస్తామని చెప్పారు.

 

Share This Post