కోవిడ్ నియంత్రణ చర్యలతో పాఠశాలల పునఃప్రారంభం:: జిల్లా విద్యాధికారి కె. రాము

కోవిడ్ నియంత్రణ చర్యలతో పాఠశాలల పునఃప్రారంభం:: జిల్లా విద్యాధికారి కె. రాము

జనగామ, సెప్టెంబర్ 1: కోవిడ్ నియంత్రణా చర్యలను ఖచ్చితంగా అమలుచేస్తూ బుధవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం అయినట్లు జిల్లా విద్యాధికారి కె. రాము అన్నారు. జిల్లాలో 516 ప్రభుత్వ పాఠశాలల్లో 35 వేల 184 మంది విద్యార్థులకుగాను 10 వేల 766 మంది, 10 ఎయిడెడ్ పాఠశాలల్లో 357 మంది విద్యార్థులకుగాను 56 మంది, 85 ప్రయివేటు పాఠశాలల్లో 26 వేల 580 మంది విద్యార్ధులకుగాను 2 వేల 574 మంది విద్యార్థులు బుధవారం పాఠశాలలకు హాజరయినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు మొత్తంగా 611 వున్నట్లు, ఇందులో 62 వేల 121 మంది విద్యార్థులు వుండగా, పాఠశాలల పునఃప్రారంభం రోజు బుధవారం న 13 వేల 396 మంది విద్యార్థులు (21.56 శాతం) హాజరయినారని జిల్లా విద్యాధికారి అన్నారు. అన్ని పాఠశాలల్లో పారిశుద్ద్యం చేపట్టి, తరగతి గదుల సానిటైజింగ్ చేసినట్లు, కోవిడ్ నియమాలను అమలుపర్చినట్లు, విద్యార్థులను పరీక్షించి అనుమతించుట, విద్యార్థికి విద్యార్థికి భౌతిక దూరం పాటించి తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post