కోవిడ్ నియమాలను పాటిస్తూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇంటర్మీడియట్ పరిక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కల్లెక్టర్ల కు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                         తేది: 21-10-2021

కోవిడ్ నియమాలను పాటిస్తూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇంటర్మీడియట్ పరిక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా  శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కల్లెక్టర్ల కు  ఆదేశించారు.

గురువారం ఉదయం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తో కలిసి అన్ని జిల్లాల కల్లెక్టర్లు మరియు సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కరోనా కారణంగా పరిక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేసిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 25 నుంచి పరిక్షలు నిర్వహిస్తున్నామని, జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు  సమన్వయం తో పరిక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించేలా పకడ్బందిగా చర్యలు చేపట్టాలని అన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ, ప్రతి సెంటర్ లో ఒక ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేయాలనీ, విధ్యార్థులు ఇన్విజిలేటర్ లు మరియ ఇతర సిబ్బంది కోవిడ్ నియమాలను పాటిస్తూ, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని అన్నారు. పరీక్ష కేంద్రం లోపలికి వాటర్ బాటిల్స్ ను అనుమతించకుండా,  కేంద్రాలలో తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనీ, నిరంతర విద్యుత్ సరపరా ఉండేలా చూసుకోవాలని, ప్రతి సెంటర్ లో సి.సి. కెమెరా లు ఏర్పాటు  చేయాలనీ , ఉన్న సి.సి.కెమెరా లు పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పరీక్షలకు ముందే కేంద్రాలను సానిటైజ్ చేయించాలని, విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఫర్నిచర్ ను ఏర్పాటు చేసి సానిటైజ్ చేయాలనీ అన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులు పరిక్షలు రాసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులు పరీక్షకు గంట ముందే సెంటర్ కు వచ్చేలా చూడాలని,. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలనీ, పోలీస్, ఆర్.టి.సి, పోస్టల్ శాఖ అధికారులు పరిక్షల సమయం లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సంసిద్దంగా ఉండాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని , మొత్తం 4311 మంది విద్యార్థులు పరిక్షలు రాయబోతున్నారని తెలిపారు.విద్యుత్ సరపరాలో అంతరాయం లేకుండా చూడాలని, సిసి కెమరాలు లేని చోట ఏర్పాటు చేయాలనీ , విద్యార్థులు పరీక్షా సమయానికి సెంటర్ కు వచ్చేలా బస్సు లు అందుబాటులో ఉంచాలని,   ప్రతి సెంటర్ లో ఇద్దరు వైద్య సిబ్బందిని, పోలీస్ బందోబస్తును  ఏర్పాటు చేయాలనీ , ఆర్.టి.సి., వైద్య, పోలీస్, రెవెన్యూ  సంబంధిత శాఖల అధికారులతో ముందుగానే కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించామని, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు అన్ని పకడ్బందిగా జరిగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

సమవేశంలో అదనపు కలెక్టర్ రఘురామ్ శర్మ, ఇంటర్మీడియట్ కన్వీనర్ హృదయ రాజు, సంబందిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి చే  జారీ చేయడమైనది.

Share This Post