కోవిడ్ నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి :జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

 

కోవిడ్ నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

జెండా ఊపి ప్రచార వాహనాలను ప్రారంభించిన కలెక్టర్

00000

కోవిడ్ ను సమూలంగా నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార 2 వాహనాలను గురువారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా ప్రమాదం పూర్తిగా తొలగి పోలేదని తెలిపారు. కరోనాను పూర్తిగా అరికట్టేందుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, తరచుగా శానిటైజర్ తో చేతులను శుభ్రపరచుకోవాలి , భౌతిక దూరం పాటించాలని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తూ ప్రచారం చేయాలని అన్నారు. గురువారం నుంచి హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసే వరకు హుజురాబాద్ నియోజక వర్గంలో నలుమూలలా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువే రియా, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post