కోవిడ్ బాధిత కుటుంభాలకు సరుకుల పంపిణీ:*

నల్గొండ, నవంబర్ 9.  కోవిడ్  బాధితకుటుంభాలను ఆదుకోవడం అభినందనీయం అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఈ రోజు కోవిడ్  బాధిత కుటుంభాలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం జిల్లా  కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు.  బాధితకుటుంభాలకు అండగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషకరమైన విషయం అన్నారు
బాధిత కుటుంభాలకు నిత్యవసరాలతో పాటు ఉపాధి కల్పించడం మంచి పరిణామ౦ అని అన్నారు.
సామాజిక బాద్యతగా కోవిడ్ బాధితులను ఆదుకోవడం మనందరి కర్తవ్యం అని తెలిపారు..
కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న పలు కార్యక్రమలు ఆదర్శవంతమని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి సి.సుభద్ర తదితరులు పాల్గొన్నారు
*కోవిడ్ బాధిత కుటుంభాలకు సరుకుల పంపిణీ:*

Share This Post