కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ పంద్రాగస్ట్ ఏర్పాట్లను చేయాలి —  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్థం

కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ పంద్రాగస్ట్ ఏర్పాట్లను చేయాలి —  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-13:

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను కోవిడ్ నియమాలు పాటిస్తూ పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పంద్రాగస్ట్ ముందస్తు ఏర్పాట్లను శాఖలవారీగా చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లా అధికారులందరూ సమిష్టిగా, బాధ్యతగా తమకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయలని తెలిపారు.  కోవిడ్ దృష్ట్యా అధికారులు, సిబ్బందితో పాటు సందర్శుకులు తప్పనిసరిగా మాస్క్ ధరించే విధంగా, భౌతిక దూరం పాటించే విధంగా చూడాలని తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమం ఏర్పాట్ల పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు అడిషనల్ కలెక్టర్ కు అప్పగించడం జరిగిందని తెలుపుతూ,  కలెక్టరేట్ కార్యాలయంలో పంద్రాగస్ట్ ఏర్పాట్లతో పాటు, ఎన్.టి.ఆర్. స్టేడియంలో నిర్వహించే ఏర్పాట్లను పర్యవేక్షించి సంబంధిత బాధ్యులైన అధికారులతో పనులు పూర్తి అయ్యేటట్లు చూడాలని సూచించారు.  ఆహ్వాన పత్రికలు, ప్రశంసా పత్రాలు, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల అవార్డు జాబితా తయారుతో పాటు ఆహ్వాన పత్రికల పంపిణీ, ప్రముఖులు, అతి ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు, ప్రెస్, సందర్శకులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా షామియానాల ఏర్పాట్లు, ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయించాలని సూచించారు.  

వాటర్ ప్రూఫ్ టెంట్ లు ఏర్పాటు చేయాలని, బారికేడింగ్ ఏర్పాట్లను పోలీసు శాఖ సమన్వయంతో ఏర్పాటు చేయాలని, కలెక్టరేట్, కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, కోర్టు, జడ్జి నివాసములను ప్రకాశవంతమైన విద్యుత్ వెలుగులతో అలంకరించాలని మునిసిపల్ కమీషనర్ ప్రసన్నారాణి కు సూచించారు. 

కార్యక్రమానికి వచ్చిన పాఠశాలల చిన్నారులకు ఫలహారాలు అందించాలని, దేశభక్తి నేపథ్యంతో కూడుకున్న సాంస్కృతిక కార్యక్రమాలను  నిర్వహించే విధంగా చూడాలని, ముందుగా రిహార్సల్ చేయాలని, నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమం నిడివి 5 నిమిషాల లోపు ఉండాలని తెలిపారు.  సాంస్కృతిక కార్యక్రమానికి సంబంధించిన సిడిని ముందుగా ప్లే చేసుకొని చూసుకోవాలని తెలిపారు.  కోవిడ్ దృష్ట్యా సాంస్కృతిక కార్యక్రమాలు తక్కువగా ఉండే విధంగా చూడాలని జిల్లా విద్యా శాఖాధికారి సోమశేఖర శర్మ తెలిపారు.

చాయాచిత్ర ప్రదర్శనల స్టాల్స్ ను ఆకట్టుకునేవిధంగా ఏర్పాటు చేయాలని డి.ఆర్. డి.ఓ.సన్యాసయ్య కు తెలిపారు. 3 లైన్ల శాఖపర నోట్స్ తయారు చేసి టాబ్ల్యు ప్రదర్శించే సందర్భంలో మైక్ ద్వారా వివరించాలని డి.టి. డి. ఓ కు సూచించారు.  

బారికేడ్లు ఏర్పాటు చేయాలని, వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని,  ప్రముఖులు కూర్చునే సీటుపై పేరు గల స్టిక్కరింగ్ చేయాలని, వృద్ధులు, వీల్ చైర్ అవసరమున్న వారు వచ్చిన సందర్భంలో వారికి అందజేయుటకు వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని, వర్షం వచ్చిన సందర్భంలో కొన్ని గొడుగులు అందుబాటులో ఉంచాలని మహబూబాబాద్ తహసిల్దార్ కు సూచించారు.

ఆహ్వాన పత్రికలో సమయం వారీగా కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకొని, ఇన్విటేషన్ కార్డుల ముద్రణ,  అవార్డు జాబితా తయారు చేసి వెంటనే ఇవ్వాలని కలెక్టరేట్ సి-సెక్షన్ సూపరింటెండెంట్ అనురాధా ను ఆదేశించారు. 

ఈ టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డి. కొమురయ్య, మునిసిపల్ కమీషనర్ ప్రసన్నారాణి, సిపిఓ-సుబ్బారావు, డి.ఇ.ఓ సోమశేఖర శర్మ, డి.ఆర్. డి.ఓ. సన్యాసయ్య, డి.టిడి.ఓ, దిలీప్ కుమార్, మహబూబాబాద్ తహసిల్దార్ రంజిత్, సి-సెక్షన్ సూపరింటెండెంట్ లు పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కు వివరించారు.

——————————————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post